రాష్ట్రీయం

సంస్థాగత బలోపేతంపై టీఆర్‌ఎస్ ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 26: సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్ ఉపయోగించుకోనుంది. రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో 80 లక్షల మందికి టీఆర్‌ఎస్ సభ్యత్వం అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందుకు అనుగుణంగా ఈ నెల 28వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సభ్యత్వ నమోదు ప్రారంభించనుంది. 20 రోజులపాటు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించిన అనంతరం గ్రామ, మండల, జిల్లా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన బాధ్యతలను నియోజకవర్గాల వారీగా స్థానిక శాసనసభ్యులకు అప్పగించనున్నారు. ఇది పార్టీలో మొదటి నుండి పనిచేస్తున్న వారికి ఇబ్బందికరంగా మారనుంది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించగా, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులపై గెలిచిన వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్‌రెడ్డి, రేగా కాంతారావు, బానోత్ హరిప్రియ, స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన రాములునాయక్‌లు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్ బలం ఈ రెండు జిల్లాల్లో 7కు చేరుకున్నది. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో కూడ బీ-్ఫంలను స్థానిక శాసనసభ్యులకే ఇవ్వడంతో పార్టీలో ముందునుంచి పనిచేస్తున్న వారు కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు సభ్యత్వ నమోదు కూడ వాళ్ళే చేసుకుంటారని, తాము కూడ సభ్యత్వం తీసుకుంటామని గతంలో మాదిరిగా పనిచేయలేమని తెగేసి చెపుతున్నారు. నాడు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా గ్రామాల్లో పనిచేసిన వారు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరిన నేపధ్యంలో వారికే సభ్యత్వ నమోదు బాధ్యతలను అప్పగించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ నేతల మధ్య విభేదాలు మరింత పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు సీనియర్ నాయకులు పార్టీ మారేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలతో పాటు పరిషత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్ నేతలు, పాతకొత్త నేతల మధ్య సయోధ్య కుదర్చడంలో విఫలమయ్యారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలలో ఉన్న నేపధ్యంలో టీఆర్‌ఎస్ నాయకత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తుందని కొందరు నాయకులు చెపుతున్నా నేటి వరకు సభ్యత్వ నమోదుకు ఇంచార్జ్‌ను కూడ నియమించలేదు.