తెలంగాణ

మహిళలకు 55 వ్యవసాయ మార్కెట్ కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణలో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 179 కమిటీలు ఉండగా, 11షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్నాయి. మిగిలిన 168 కమిటీల్లో మహిళలకు 55 కేటాయించి, జనరల్‌కు 113 కేటాయించారు. వ్యవసాయ ఉత్పాదన కమిషనర్ చైర్‌పర్సన్‌గా, సభ్యులుగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ డైరక్టర్, డిప్యూటీ సెక్రటరీ, మార్కెటింగ్ శాఖ అదనపు డైరక్టర్లతో కూడిన కమిటీ సమావేశమై రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. 168 కమిటీల్లో ఎస్‌సిలకు 25 (15 శాతం), ఎస్‌టిలకు 10 ( 6 శాతం), బిసిలకు 49( 29 శాతం), ఒసిలకు 84 కమిటీలను రిజర్వేషన్ల నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా మహిళలకు 33శాతం రిజర్వేషన్ల ప్రకారం 55 కమిటీలను ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

అప్పుల బాధతో
ఇద్దరు రైతుల ఆత్మహత్య
ఆత్మకూర్/నాగార్జునసాగర్ ఏప్రిల్ 13: మహబూ బ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండలంలోని జూరాల గ్రామానికి చెందిన రైతు కాసీం (50) అప్పులబాధ భరించలేక వ్యవసాయ పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న మూ డున్నర ఎకరాల వ్యవసాయ పొలంలో వరినాట్లు వేయగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట చేతికందకపోగా రూ.3 లక్షల అప్పు తీర్చలేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేవిధంగా నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం నాగా ర్జునసాగర్ పోలీస్‌స్టేషన్ పరిదిలోని చింతలపాలెం గ్రామ పంచాయతీ నాయకుని తండాలో అప్పుల బాధ భరిం చలేక మెరావత్ బాలు (32) అనే పత్తిరైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

లోక్ అదాలత్‌లో
3492 కేసులు పరిష్కారం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 13: మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 3492 కేసులు పరిష్కారమయ్యాయి. నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఎర్రమంజిల్, సికిందరాబాద్ కోర్టుల పరిధిలోని కేసులను పరిష్కరించినట్టు మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఎ. శ్రీనివాస్‌కుమార్ ఒక ప్రకటనో తెలిపారు. అదేవిధంగా ఈ నెల 16న కూడా జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

వడదెబ్బకు ఏడుగురు మృతి
వరంగల్/కరీంనగర్/మెదక్/నల్లగొండ/మహబూబ్‌నగర్, ఏప్రిల్ 13: తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం వడగాల్పులు ఎక్కువయ్యాయ. వడదెబ్బలను తట్టుకోలేక వివిధ గ్రామాల్లో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. వరంగల్ జిల్లా సంగెం మండలం లోహిత గ్రామంలో ల్యాదెల్ల యాకయ్య (67), మెదక్ జిల్లా కొండపాక మండలంలోని బందారం గ్రామానికి చెందిన పీరెల్లి యాదగిరి (40) అనే ఉపాధి హామీ కూలీ, కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం దేశరాజుపల్లి గ్రామానికి చెందిన ఎర్రం మధురమ్మ (70) అనే వృద్ధురాలు, సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి పంచాయతీ పరిధి ఆరెపల్లి గ్రామానికి చెందిన బత్తుల మల్లయ్య (73) అనే వృద్ధుడు, నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర హిల్‌కాలనీకి చెందిన ఇమ్మడి కృష్ణమూర్తి (65), నూతన్‌కల్ మండల పరిధిలోని పెదనెమిల గ్రామానికి చెందిన గడ్డం మురళీ (35), మహబూబ్‌నగర్ జిల్లా పెద్దమందడి మండల పరిదిలోని గట్లఖానాపుర గ్రామానికి కావలి సవరయ్య (65) అనే వ్యక్తి వడదెబ్బతో మరణించారు.