తెలంగాణ

వికలాంగుల జీవితాల్లో ‘సోలార్’ వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఏప్రిల్ 13: ఉపాధి బరువై బతుకు భారమవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అందించిన చేయూత, అధికారులు అందిస్తున్న సహకారానికి అంగవైకల్యంలో ఏ మాత్రం అడ్డురాదని నిరూపిస్తూ అందరికీ ఆదర్శవంతమైన సోలార్ పరికరాలను ఉత్పత్తి చేస్తూ స్వశక్తితో స్వయం ఉపాధి పొందుతున్నారు. ఈ యేడాది ఫిబ్రవరి 2వ తేదీన డిఆర్‌డిఎ (పాత వెలుగు) కార్యాలయం ఆవరణలో ఉన్న ఒక భవనంలో దివ్యాంగ్ సోలార్ సొసైటీ పేరుతో చిన్నవి మొదలుకుని పెద్ద పెద్ద పరికరాల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. సంగారెడ్డి మండలం కంది గ్రామానికి చెందిన 9 మంది, రామచంద్రాపూర్ మండలం తెల్లాపూర్‌కు చెందిన ఇద్దరు, ఇస్నాపూర్‌కు చెందిన మరో ఇద్దరు వికలాంగులకు జనవరిలో హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డిలో నాలుగు రోజుల పాటు సోలార్ లాంతర్లు, టేబుల్‌పై పెట్టుకుని చదువుకునే లైట్లు, ఇతర ఉత్పత్తులపై శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ రొనాల్డ్ రోస్ సంపూర్ణ సహకారంతో త్రైవ్ కంపెనీ ఆధ్వర్యంలో కావల్సిన ముడి సరుకులను సమకూర్చుకుని సోలార్ లాంతర్ల మాదిరిగా లైట్లను ఉత్పత్తి చేస్తున్నారు. రెండు గంటల పాటు ఎండలో పెడితే ఎనిమిది గంటల పాటు పని చేసేంత శక్తిని సంగ్రహించుకుంటున్నాయి. రాత్రి సమయాల్లో వీటిని ఉపయోగిస్తే కరెంటు బిల్లులను అధిగమించే అవకాశం ఉంది. ఇళ్లతో పాటు వ్యవసాయదారులు రాత్రి సమయాల్లో పొలానికి వెళ్లినా టార్చిలైటుకు దీటుగా పనిచేస్తూ ఉపయోగపడుతుంది. 300 రూపాయలు మొదలుకుని 1800 రూపాయల వరకు వివిధ రకాల లైట్లను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతి రోజు 150 నుంచి 200 వరకు ఐదు నిమిషాలకు ఒకటి చొప్పున తయారు చేస్తున్నారంటే వికలాంగులు నైపుణ్యానికి నిదర్శనం పడుతోంది. సోలార్ ఫ్యాన్లు, సోలార్ పంపుసెట్లను ఆర్డర్లపై తయారు చేయడానికి తాము సిద్ధమేనని సొసైటీ అధ్యక్షురాలు జుబేదా పేర్కొన్నారు. సొసెటీని స్థాపించకముందు తాము ఉపాధి కూలీలకు వెళ్లే వారమని, పగలంతా కష్టపడి పనిచేసినా సరియైన కూలీ గిట్టుబాటుకాలేదని, శరీరదారుఢ్యం ఉన్న కూలీలు తమను ఎగతాళి చేసే వారని దీంతో మానసికంగా కృంగిపోయామంటున్నారు. అలాంటి సమయంలోనే కలెక్టర్ తమ జీవితాల్లో వెలుగులు నింపుతూ సోలార్ ఉత్పత్తులపై చక్కటి శిక్షణ ఇప్పించారని, దీంతో నీడలో కూర్చుండి స్వయం ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు.

అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు
ప్రకటనలకే పరిమితమా?

నగరంలో పలుచోట్ల అగ్నిప్రమాదాలు
కల్సుంపురలో 20 గుడిసెలు దగ్ధం,
జీడిమెట్లలో గోదాం దగ్ధం
ఫైరింజన్లు వచ్చేసరికి కోట్లలో
నష్టపోతున్న యాజమాన్యాలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 13: అగ్నిప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ఫైర్ స్టేషన్ల ఏర్పాటు ప్రకటనలకే పరిమితమైందనే విమర్శ సర్వత్రా వినవస్తోంది. నగరంలో వేసవి తీవ్రతతో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా బుధవారం కుల్సుంపురలో 20 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. బాధితులంతా నిరాశ్రయులయ్యారు. కాగా ఓ కుటుంబంలో పెళ్లికి కోసం తెచ్చుకుని దాచుకున్న బంగారం, లక్ష రూపాయల నగదు దగ్ధం అయ్యాయి. అదేవిధంగా జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఓ రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్తినష్టం తెలియరాలేదు. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో నగరంలో తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. అయితే మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లు సకాలంలో చేరకపోవడంతో యజమానులు కోట్లలలోనే నష్టపోవాల్సి వస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఐడిఎ బొల్లారం పారిశ్రామిక వాడల్లో అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు కలగానే మారింది. అగ్నిప్రమాదం జరిగిందంటే ముందుగా గుర్తుకొచ్చేది ఫైరింజనే్ల. అయితే అవి ప్రమాద స్థలికి చేరే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇటీవల బొల్లారం, గడ్డపోతారం, బాచుపల్లి, ఇస్నాపూర్, మేడ్చల్, నాచారంలలో వందలాది రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వేసవి వచ్చిందంటే ఇక్కడి ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకీడ్చుతున్నారు. పరిశ్రమల్లో ఎప్పుడు, ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడి ప్రాంతంలో పారిశ్రామిక వాడలు ఏర్పడి మూడు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేయకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుపై ప్రజాప్రతినిధులు ఇస్తున్న హామీలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. గత సంవత్సరం రాష్ట్ర హోంమంత్రి నాయిని నార్సింహరెడ్డి అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేస్తానని చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణవ్యాప్తంగా అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ. 112 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం తెలంగాణలోని పది జిల్లాల్లో 18 అగ్నిమాపక కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి. కాగా ఈ సంవత్సరం 88 అగ్నిప్రమాద కేసులు నమోదయ్యాయి. ఇప్పటికైనా పారిశ్రామిక వాడలతోపాటు జనసమ్మర్ధం ఉండే ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం

మాజీ ఎంపి వివేక్, కార్మిక సంఘాల ఆరోపణ

మందమర్రి ఏరియా శాంతిఖని బొగ్గు గనిలో బుధవారం జరిగిన ప్రమాదం సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ దుర్ఘట న చోటుచేసుకుందని మాజీ ఎంపి వివేక్ ఆరోపించారు.
శాంతిఖని బొగ్గు గనిలో ప్రమాదం జరిగిందనే విషయాన్ని తెలుసుకుని బొగ్గు గనికి చేరుకుని సంఘటన జరిగిన వివరాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బొగ్గు గనిలో మూడు నెలల్లో నాలుగో దుర్ఘటన జరిగిందని, ఉత్పత్తిపైనే శ్రద్ధ వహిస్తున్న యాజమాన్యం కార్మికుల రక్షణ చర్యలపై ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య పూరిత చర్యల వల్లనే ముగ్గురు కార్మికులు ప్రమాదానికి కారణమయ్యారని, ఆ కార్మికులను రక్షిం చేవిధంగా యాజమాన్యం సహాయక చర్యలు కొనసాగించి వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రమాద బాధితులకు ఉద్యోగంతో పాటు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ బొగ్గు గనిలో ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు.