రాష్ట్రీయం

సీమ భగభగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: అధిక ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ సీజన్‌లోనే ఇప్పటివరకూ అత్యధిక ఉష్ణోగ్రత ఖమ్మం జిల్లా మణుగూరులో నమోదైంది. గురువారం నాడు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మణుగూరు నిప్పుల గుండాన్ని తలపించింది. కాగా వచ్చే మూడు రోజులు వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్ రెండో వారంలోనే ఈ స్థాయిలో ఎండలు ముదిరిపోయి రెండు రాష్ట్రాలు అగ్నిగుండంగా మారాయి. వృద్ధులు, చిన్నపిల్లలు వడదెబ్బ తాకిడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.గత 43 ఏళ్ల చరిత్రలో ఏప్రిల్‌లో ఇంత భారీగా ఉష్ణోగ్రతలు పెరగడం ఇదే ప్రధమంగా వాతావరణ శాఖ అధికారి వైకె రెడ్డి చెప్పారు.
ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడానికి కారణం ఎల్‌నినో ప్రభావమేనని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా మణుగూరులో 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగా, నల్గొండలో 44 డిగ్రీల తీవ్రత నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లోని జంగమేశ్వరం, అనంతపురం, కర్నూలు పట్టణాల్లో 44 డిగ్రీల సెల్షియస్ నమోదైంది. నంద్యాల, తిరుపతిలో కూడా 43 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. నందిగామలో 42, నెల్లూరులో 41 డిగ్రీలు నమోదైంది. గత వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తెలంగాణలో రామగుండం సహా హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ 43, నిజాబాబాద్‌లో 43 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ఈ తరహాలో మరో మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదై, వడగాడ్పుల తీవ్రత కొనసాగుతుందని బేగంపేట వాతావరణ కేంద్రం అధికారి వై.కె.రెడ్డి తెలిపారు.

చిత్రం నిర్మానుష్యంగా ఉన్న అనంతపురం జడ్పీ రోడ్డు