రాష్ట్రీయం

అందరివాడు అంబేద్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 14: అంబేద్కర్ కేవలం ఒక్క కులానికో, మతానికో చెందినవాడు కాదని, యావత్ భారత జాతికి స్ఫూర్తి ప్రదాత అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని ఎ కనె్వన్షన్ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతి పితగా గాంధీని, రాజ్యాంగ పితగా అంబేద్కర్‌ను భారత ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ పవిత్ర గ్రంథంగా భావించాలని, దీనికి ఎవరూ అతీతులు కారని చంద్రబాబు చెప్పారు. బడుగు, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఎన్టీఆర్ పాలన సాగించారని చెప్పారు. బడుగు, బలహీనవర్గాల వారిని కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా మారిస్తే తెలుగుదేశం వారి అభ్యున్నతికి కృషి చేసిందని అన్నారు. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలకు గుర్తుగా రాజధాని అమరావతిలో 15 ఎకరాల స్థలంలో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, అలాగే అక్కడ ఆయన స్మారక పార్క్‌నూ నిర్మిస్తామని తెలిపారు.
గురుకుల పాఠశాలగా హాస్టళ్లు
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను గురుకుల పాఠశాలలుగా మార్చనున్నామని, సంవత్సరం లోగానే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని బాబు తెలిపారు. అలాగే ఎస్సీ హాస్టళ్ళన్నింటినీ మూడేళ్లలో గురుకుల పాఠశాలలుగా మార్చి, వారికి కార్పొరేట్ విద్యను అందిస్తామని చెప్పారు. కామన్ కిచెన్‌తో పౌష్టికాహారాన్ని అందిస్తామన్నారు. ఉపాధ్యాలు, హాస్టళ్ల వార్డెన్లకు విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్నిబట్టి పదోన్నతులు, బదిలీలు ఉంటాయన్నారు. విద్యార్ధులు ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు పొందే వరకూ బాధ్యత తాను తీసుకుంటానని బాబు తెలిపారు.
చిత్రం జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభిస్తున్న సిఎం చంద్రబాబు