రాష్ట్రీయం

సొంతిళ్లకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 14: పేదల సొంతింటి కల నిజం చేసేలా నేటి అవసరాలకు అనుగుణమైన పక్కా గృహాల నిర్మాణంలో ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే గుర్తింపు పొందబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గరీబీ హఠావో నినాదం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తమ పదేళ్ల పాలన కాలంలో నిరుపేదల ఇళ్ల నిధులను సైతం దోచుకుందంటూ నిప్పులు చెరిగారు. అసలు ఇందిరమ్మ గృహాల పథకంలో అన్ని స్థాయిల్లోనూ అంతులేని అవినీతి, మోసం, దగా, దోపిడీ విచ్చల విడిగా సాగిందంటూ ధ్వజమెత్తారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ పదేళ్ల కాలంలో కోటి గృహాలకు రూ. 42వేల కోట్లు మంజూరు కాగా కేవలం రూ.12వేల కోట్లు మాత్రమే ఖర్చయిందన్నారు. అసలు అందులో వారు నిర్మించిన 14.50 లక్షల గృహాలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. రూ.5వేల కోట్లపైగా దళారులు, మధ్యవర్తులు దోచుకున్నారని అన్నారు. అందుకే పేదలకు సైతం పక్కా గృహాలు ఉండాలనే దివంగత ఎన్టీఆర్ ఆలోచన, స్ఫూర్తితో ప్రతి పేదవానికి గూడు కల్పించబోతున్నామన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా రెండు పడక గదుల ఆరు లక్షల గృహాల నిర్మాణానికి, అలాగే విజయవాడలో 10వేల గృహాల నిర్మాణానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. వీటిలో తొలుత కాలువగట్టులపై నివసిస్తున్న 8,300 కుటుంబాలకు కేటాయించి ఆపై మిగిలిన 1700 ఇళ్ల కోసం లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు నగరం మధ్య నుంచి వెళ్ళే కాలువలన్నీ ఆక్రమణల వల్ల కలుషితమవుతుండటాన్ని గుర్తించి, 265 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల వౌలిక సదుపాయాలతో ఇళ్ళు నిర్మిస్తున్నామన్నారు. ఐదున్నర లక్షల రూపాయల ఖర్చుతో 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో డబుల్ బెడ్ రూం, కిచెన్, టాయ్‌లెట్ వంటి సదుపాయాలతో వీటిని నిర్మించడమేగాక అందుబాటులో కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మించగలమన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రూ. 1.80 లక్షలు, బిసి వర్గాలకు రూ. 1.25 లక్షలు సబ్సిడీగా అందిస్తామన్నారు. పాతగృహాలకు రూ. 50 కోట్లతో మరమ్మతులు చేసి వాటిని నివాసయోగ్యంగా మారుస్తామన్నారు. రాష్ట్రంలో నేడు శ్రీకారం చుట్టిన ఈ ఆరు లక్షల గృహ నిర్మాణాలతో సరిగ్గా ఏడాది కాలంలోనే పేదల జీవితాల్లో వెలుగు నింపబోతున్నామన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ ఈ ఆరు లక్షల గృహాల్లో ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం ద్వారా రెండు లక్షల గృహాలు, పట్టణ గృహ నిర్మాణ పథకం ద్వారా రెండు లక్షలు, ఎన్టీఆర్ నవనీకరణలో భాగంగా 1.50 లక్షల గృహాలు ఇతర గృహాలుగా 50వేలు ఉంటాయని తెలిపారు. ముందుగా చైనా సంస్థ ప్రతినిధిలు గృహాల నమూనా డిజైన్‌ను ఛాయాచిత్ర ప్రదర్శన ద్వారా సిఎంకు చూపారు. పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమ, కిమిడి మృణాళిని, కొల్లు రవీంద్ర, ఎంపి కేశినేని నాని, జెడ్‌పి చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, మేయర్ కోనేరు శ్రీ్ధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
125 మందితో దివ్యజ్యోతి
శాప్ చైర్మన్ పిఆర్ మోహన్, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌ల నేతృత్వంలో స్టేడియం నుంచి 125 మంది క్రీడాకారులతో భారీ ర్యాలీగా తీసుకువచ్చిన అంబేద్కర్ దివ్యజ్యోతిని సిఎం చంద్రబాబు తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అందుకున్నారు.

చిత్రం పేదల ఇళ్లకు శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు