రాష్ట్రీయం

విధి నిర్వహణలోనే ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ బేగంపేట, ఏప్రిల్ 14:విధి నిర్వహణలో ఉన్న ఓ హోంగార్డు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికిందరాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ సమీపాన జరిగిన ఈ సంఘటన స్థానికుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మహంకాళి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్‌పెక్టర్ డిడి సింగ్ కథనం ప్రకారం.. నగరంలోని చింతల్‌కు చెందిన హోంగార్డు బాల్‌రాజ్ (44) గత ఎనిమిది మాసాలుగా మహంకాళి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం మహంకాళి దేవాలయం ఎదుట విధుల్లో ఉన్న హోంగార్డు బాల్‌రాజ్ కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగాడు. నురుగులు కక్కుతూ పడిపోయిన బాల్‌రాజ్‌ను గమనించిన పరిసర ప్రాంతాల వారు పోలీసులకు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందాడు. ఈ సంఘటన పోలీస్ స్టేషన్ ఎదురుగావున్న సిసి కెమెరాలో రికార్డు కూడా అయింది. బాల్‌రాజ్ ఆత్మహత్యకు పాల్పడే ముందు ఒక మహిళ వచ్చి అతనిని కలిసి వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. కాగా అతను తన భార్యతో గురువారం ఉదయం గొడవ పడ్డాడని, మధ్యాహ్నం విధులకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. హోంగార్డు బాల్‌రాజ్ తెలంగాణ హోంగార్డుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.

చిత్రం హోంగార్డు బాల్‌రాజ్ మృతదేహం