తెలంగాణ

14న వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: నిజామాబాద్, కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పోరేషన్లలో వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల జాబితాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఈ నెల 14 న సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ పేరుతో సర్క్యులర్ జారీ అయింది. జూలై 15 న ఈ జాబితాను ప్రకటించాలని, అదే రోజు మున్సిపల్ కార్పోరేషన్లలోనే అఖిల పక్షం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి, వారి అభిప్రాయాలను సేకరించాలని సూచించారు.
ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాపై ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలు ఉంటే జూలై 17 వరకు స్వీకరించాలని సూచించారు. ఈ అభ్యంతరాలపై నిర్ణయాన్ని 18 న ప్రకటించాలని సూచించారు. అదే రోజు తుది పోలింగ్ కేంద్రాల జాబితాలను సంబంధిత కమిషనర్లకు రిటర్నింగ్ అధికారులు సమర్పించాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారులైన జిల్లా కలెక్టర్లతో 19 న జాబితాలపై ఆమోదం తీసుకోవాలని సూచించారు. అదే రోజు సంబంధిత తుది పోలింగ్ కేంద్రాల జాబితాలను కమిషనర్లు వెల్లడించాలని సూచించారు.