రాష్ట్రీయం

ఏఓబిలో కల్లోలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 14: ఏఓబి (ఆంధ్ర-ఒడిశా సరిహద్దు)గా ఒకప్పుడు వ్యవహరించిన తూర్పు గోదావరి, ఖమ్మం, చత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాలు మావోయిస్టు కదలికలు, పోలీసు ప్రత్యేక బలగాల తాకిడితో దద్దరిల్లుతున్నాయి. సరిహద్దు ఆదివాసీ ప్రాంతాలు భయం గుప్పిట అల్లాడుతున్నాయి. చత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక చోట మావోయిస్టు ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో మోహరించిన ప్రత్యేక పోలీసు బలగాలను వెనక్కు మళ్లించాలని డిమాండు చేస్తూ మావోయిస్టులు శుక్రవారం సరిహద్దు ప్రాంతాల్లో బంద్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిషా సరిహద్దు ప్రాంతాల్లో ఈ నాలుగు రాష్ట్రాల పోలీసు బలగాలు సంయుక్తంగా జల్లెడ పడుతున్నాయి. ఈ పోలీసు స్టేషన్లలో పెద్దఎత్తున బలగాలను మోహరించారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలానికి అతి సమీపంలో పోలీసు ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోలు హతమయ్యారు. ఈ ఘటనకు ప్రతిగా మావోయిస్టులు ఎదురుదాడికి తెగబడతారనే అనుమానంతో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతూనేవుంది. అందుకే బుధవారం నాటి ఎపి ముఖ్యమంత్రిచంద్రబాబు పర్యటన పోలీసులకు సవాల్‌గా మారింది. పర్యటన ప్రశాంతంగా ముగియడంతో పోలీసు యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో విలీనమైన చింతూరు, వరరామచంద్రపురం, కూనవరం, నెల్లిపాక మండలాలతోపాటు చింతూరు-చత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లోని పలు ప్రాంతాలు, తెలంగాణ సరిహద్దులోని వెంకటాపురం, వాజేడు, పేరూరు, చర్ల, దుమ్ముగూడెం, మారాయిగూడెం, కొత్తపల్లి ప్రాంతాలు మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో మావోయిస్టుల ప్రాబల్యం బాగా విస్తరించినట్టు పోలీసు నిఘా నివేదికలు వెల్లడిస్తున్నాయి.