రాష్ట్రీయం

మున్సిపల్ చట్టం కోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం ఈ నెల 18, 19 తేదీలలో రెండు రోజుల పాటు ప్రత్యేక శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. జూలై 18న జరిగే సమావేశంలో నూతన మున్సిపల్ బిల్లు ప్రతులను సభ్యులకు అందజేసి, దాని మీద చర్చించిన తర్వాత ఆ మరుసటి రోజు 19న బిల్లు చట్టంగా ఆమోదం పొందనుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ప్రత్యేక శాసనసభ, మండలి సమావేశాలు మున్సిపల్ బిల్లు ఆమోదం కోసం మాత్రమే ఉద్దేశించిందని పేర్కొన్నారు. దీంతో ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, ఇతర ప్రొసీడింగ్స్ ఉండవని స్పష్టం చేశారు. నూతన మున్సిపల్ చట్టం అమలులోకి వచ్చాక ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్టు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాగా మున్సిపల్ బిల్లును పరిశీలించి తుది రూపం ఇవ్వడానికి ఇప్పటికే న్యాయశాఖకు పంపించినట్టు సీఎం పేర్కొన్నారు.