రాష్ట్రీయం

ఆంధ్ర, తెలంగాణ నదీ జలాల ఒప్పందం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : గోదావరి జలాల వినియోగంపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య త్వరలో ఒప్పందం ఖరారు కానుంది. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. సాలీనా ధవళేశ్వరం ఆనకట్ట ద్వారా దాదాపు 3వేల టీఎంసీ నీరు సముద్రంలో వృథాగా పోతోంది. కృష్ణా నదిపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. రెండు రాష్ట్రాల్లో పది జిల్లాల ప్రజలు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నారు. భవిష్యత్తులో రాజకీయంగా ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు తలెత్తకుండా ఉండేందుకు చట్టానికి లోబడి నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఏపి, తెలంగాణ ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. కాగా కచ్చితంగా ఈ విధంగా గోదావరి జలాలను కృష్ణా నదిలోకి మళ్లిస్తారనేదానిపై ఇంకా చర్చలు కొలిక్కి రాలేదు. ఈ నెలాఖరులోపల కేసీఆర్, జగన్‌లు భేటీ అయి అంతవరకు సిద్ధమైన ప్రతిపాదనలపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ సారి చర్చలు అమరావతిలో జరగనున్నాయి. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు ఆంధ్రా, తెలంగాణకు చెందిన సాగునీటి ఇంజనీరింగ్ నిపుణులు గత 15 రోజులుగా చర్చలు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీలోపల వీరు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం తెలంగాణలో గోదావరి నది నుంచి నీటిని శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు మళ్లించే విషయమై ఇంజనీర్లు చర్చలు చేస్తున్నారు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ, అక్కడి నుంచి పులిచింతల, అక్కడి నుంచి నాగార్జునసాగర్, శ్రీశైలంకు రివర్సబుల్ విధానం ద్వారా నీటిని తోడేందుకు సాంకేతిక పరమైన అవరోధాలున్నట్లు సమాచారం. కాగా గోదావరిపై కంతనపల్లి దిగువున రాంపూర్ వద్ద 85 మీటర్ల ఎత్తులో బ్యారేజీని నిర్మించి సొరంగ మార్గం ద్వారా నీటిని తరలించాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ మార్గంలో అడవులు ఉన్నాయి. ఇక్కడ 23 కి.మీ మేర కాల్వను తవ్వాలంటే కచ్చితంగా కేంద్రపర్యావరణ శాఖ నుంచి అనుమతుల సమస్య ఉంటుంది. కాకతీయ కాలువను రెండు టీఎంసీల నీటిని తీసుకెళ్లేందుకు వీలుగా వెడల్పు చేయాల్సి ఉంటుంది. ఈ కాలువను మూసీ నదిని దాటేందుకు అక్విడెక్ట్‌ను నిర్మించాల్సి ఉంటుంది. రాంపూర్ నుంచి నాగార్జునసాగర్‌కు సాగునీటినిమళ్లించే ఈ స్కీంకు రూ.65వేల కోట్లు ఖర్చవుతుందని అంచనావేస్తున్నారు. రెండవ ప్రణాళిక ప్రకారం 70 కి.మీ సొరంగ మార్గం తవ్వి ఒక టీఎంసీ నీటిని శ్రీశైలం జలాశయానికి నీటిని మళ్లించాలి. ఈ స్కీంకు దాదాపు రూ.75వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1450 టీఎంసీ గోదావరి జలాలు, 812 టీఎంసీ కృష్ణా జలాలను గతంలో కేటాయించిన విషయం విదితమే.