రాష్ట్రీయం

16న చంద్ర గ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 11: చంద్రగ్రహణం కారణంగా ఈనెల 16వ తేదీ రాత్రి 7 నుంచి 17వ తేదీ ఉదయం 5 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేస్తారని భక్తులు ఈవిషయాన్ని గుర్తించాలని టీటీడీ పిఆర్వో రవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 16వ తేదీ అర్థరాత్రి 1.31 నుంచి 17వ తేదీ ఉదయం 4.29 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుందన్నారు. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. 17వ తేదీ ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహించాక తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారని తెలియజేశారు. ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభం అవుతుందన్నారు. కాగా 17వ తేదీ ఆణివార ఆస్థానం సందర్భంగా 16వ తేదీన శ్రీవారి ఆలయంలో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ కారణంగా 16వ తేదీ ఉదయం 6 నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉండదు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుంది. ఇందువల్ల ఈనెల 15వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు రద్దీని అనుసరించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్‌లలోకి భక్తులను అనుమతిస్తారు. వీరికి 16వ తేదీ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనం కల్పిస్తారు. 17వ తేదీ ఉదయం 5 గంటల నుంచి మాత్రమే సర్వదర్శనం భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి అనుమతిస్తారు.
16న అన్నప్రసాద వితరణ కేంద్రాలు మూత
చంద్రగ్రహణం కారణంగా ఈనెల 16వ తేదీ రాత్రి 7 గంటల నుంచి తిరుమలలోని అన్నప్రసాదాల వితరణ ఉండదు. 17వ తేదీ ఉదయం 9 గంటలకు అన్నప్రసాదాల పంపిణీ పునః ప్రారంభం అవుతుంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రం, పిఏసీ-2, అన్నప్రసాద వితరణ కేంద్రాలు, టీటీడీ ఉద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, ఎస్వీ విశ్రాంతి భవనాలలో అన్నప్రసాదాల వితరణ ఉండదు. అయితే భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా టీటీడీ అన్నప్రసాదాల వితరణ విభాగం ఆధ్వర్యంలో 20వేల పులిహోర, టమోట అన్నం ప్యాకెట్లను ఈనెల 16వ తేదీ సాయంత్రం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ చేస్తారు. తిరుమలలోని అన్నప్రసాద వితరణ కేంద్రాలు, నాదనీరాజనం వేదిక, మ్యూజియం వద్ద, వైభవోత్సవ మండపం ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాదం ప్యాకెట్లు అందిస్తారు.
ఆర్జిత సేవలు, పౌర్ణమి గరుడ సేవ రద్దు
ఈనెల 16వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతోపాటు చంద్రగ్రహణం కారణంగా అష్టదళ పాదపద్మారాధన, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. పౌర్ణమి గరుడ సేవను కూడా రద్దు చేసింది. 17వ తేదీ ఆణివార ఆస్థానం కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది.