రాష్ట్రీయం

పంచాయతీలకు శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: రాష్ట్రంలో పంచాయతీలు కొత్త శోభను సంతరించుకోనున్నాయి. దీని కోసం ప్రభుత్వం కార్యాచరణతో ముందుకెళ్తోంది. పంచాయతీరాజ్ కొత్త చట్టాన్ని పకడ్బందీగా అమలు కోసం స్థానిక ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం కీలక నిర్ణయించింది. దీని కోసం రాష్టవ్య్రాప్తంగా నాలుగు చోట్ల పంచాయతీ సమ్మేళనాలను నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రం మొత్తానికి కలిపి ఒకచోట సమ్మేళనం నిర్వహించడం కష్టతరమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఉత్తర తెలంగాణలో రెండు చోట్ల, దక్షిణ తెలంగాణలో రెండు చోట్ల సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకుగాను ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్, దక్షిణ తెలంగాణలోని మేడ్చల్, మహబూబ్‌నగర్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
ఎంపిక చేసినట్టు అధికార వర్గాల సమాచారం. అయితే వీటిని ఏ తేదీల్లో నిర్వహించాలన్న విషయం సీఎం పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఈ నెల 18, 19న శాసనసభ సమావేశాలు, ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల తర్వాత ఆగస్టు రెండో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. గ్రామాలలో పరిశుభ్రత, పచ్చదనం, అవినీతిరహితం, పారదర్శకత, జవాబుదారీతనం ఐదు అంశాలు ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని పంచాయతీరాజ్ కొత్త చట్టాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థలకు ఇటీవలనే ఎన్నికలు జరగడంతో కొత్తగా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులకు ఈ చట్టంపై పెద్దగా అవగాహన లేదు. మండల ప్రాదేశిక సభ్యులు (ఎంపీటీసీలు), జిల్లా ప్రాదేశిక సభ్యులు (జడ్‌పీటీసీలు), మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్, చైర్ పర్సన్లకు కొత్త చట్టంపై అవగాహన కల్పించడానికి పంచాయతీ సమ్మేళనాలు నిర్వహించనున్నట్టు ఇదివరకే సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలు ద్వారా గ్రామాల్లో మరో మూడు నెలల్లో గుణాత్మక మార్పును తీసుకురావాలని సీఎం భావిస్తున్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శుల నియామకం కూడా పంచాయతీ ఎన్నికల ముందే జరగడంతో వారికి కూడా కొత్త చట్టంపై అవగాహన అంతంత మాత్రమే. వారికీ మూడు నెలలు పాటు శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు మొత్తంగా 8 వేల మందిని ఈ సమ్మేళనాలకు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.