రాష్ట్రీయం

22న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే రాజకీయ పార్టీలతో చర్చించిన రాష్ట్ర ఎన్నికల సంఘం, ఎన్నికల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్లకు అవగాహనం కల్పించింది. శనివారం కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఎన్నికల షెడ్యూల్డ్ ఖరారు చేసి, ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం వర్గాల సమాచారం. ఆ లోగా మున్సిపల్ కొత్త చట్టానికి శాసనసభ ఆమోదం తెలపనుండటంతో దాని ప్రకారమే ఎన్నికల నిర్వహించడానికి ఈ నెల 22న తేదీని ఖరారు చేసినట్టు తెలిసింది. ఆ రోజు పంచమి మంచి తిథి ఆవడంతో నోటిఫికేషన్ జారీకి ఎంపిక చేసినట్టు తెలిసింది. ఆ లోగా ఈ నెల 18, 19 తేదీలలో కొత్త మున్సిపల్ చట్టం ఆమోదం కోసం ప్రత్యేకంగా శాసనసభ, మండలి సమావేశం కానున్న విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ముందే ఆర్డినెన్స్ ద్వారా వార్డుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా మిగిలిన 138 మున్సిపాలిటీలలో 754 వార్డులను పెంచుతూ గత నెల జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టి చట్టంగా ఆమోదం పొందనుంది. వార్డుల రిజర్వేషన్ల ఖరారు ఒక్కటే మిగిలి ఉండటంతో కొత్త చట్టం ప్రకారమే ఇవీ ఖరారు కానున్నాయి.