తెలంగాణ

భూదాన్ భూములు పంచాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: రాష్ట్ర ప్రభుత్వం భూదాన్ బోర్డును ఏర్పాటు చేసి, తక్షణమే పేదలకు భూదాన్ భూములు పంచాలని, ఇళ్లు లేని పేదలు అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. భూదాన్ బోర్డు ఏర్పాటును డిమండ్ చేస్తూ సీపీఐ మహాధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈటీ నరసింహ, ప్రధానకార్యదర్శి వీఎస్ బోస్, సర్వసేవా సంఘ్ జాతీయ ప్రధానకార్యదర్శులు షేక్ హుస్సేన్, సర్వోదయ మండలి రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్ శంకర్ నాయక్, చాయాదేవి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నలుమూలల నుండి అధికసంఖ్యలో కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. నాలుగేళ్ల కిందట అఖిలపక్ష పార్టీల సమావేశంలో ప్రతి పేదవాడికి జీవో 58 ప్రకారం 125 గజాల స్థలానికి పట్టా ఇస్తూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ స్వయంగా చెప్పారని అది ఇంకా అమలుకు నోచుకోలేదని అన్నిరు. ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను నమ్మించి గత గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించుకున్నారని ఎద్దేవా చేశారు. హామీలను నెరవేర్చని సీఎం ఏ మొహం పెట్టుకుని మున్సిదపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. నగరంలో భూ కబ్జాలు పెరిగిపోతున్నా, రాష్ట్ర ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని అన్నారు. దీంతో భూకబ్జా దారులు మరింత రెచ్చిపోతున్నారని అన్నారు. ఒకపుడు కళకళలాడిన చెరువులు, కుంటలు ఇళ్లు లేని పేదలు లక్షలాది మంది ఉన్నా వీరందరినీ మరచి విలావంతంగా ప్రగతి భవన్ నిర్మించుకున్న సీఎం కేసీఆర్ వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలకు తగిన గుణపాఠం చెప్పకతప్పదని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా భూదాన్ బోర్డును ఏర్పాటు ఏచసి ఆ స్థలాలన్నీ పేదలకు పంచేలా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు నిర్వహిస్తామని చాడ వేంకటరెడ్డి హెచ్చరించారు. అనంతరం సర్వసేవా సంఘ్ జాతీయ ప్రధానకార్యదర్శి షేక్ హుస్సేన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడచినా నేటికీ భూదాన్ బోర్డును ఏర్పాటు చేయకపోవడం దారుణమని అన్నారు. ఎఐటీయూసీ ప్రధానకార్యదర్శి వీఎస్ బోస్ మాట్లాడుతూ పేదలకు చట్టబద్ధంగా అందాల్సిన భూదాన్ భూములు బడాపారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్తున్నాయని పేర్కొన్నిరు. సీపీఐ నేత ఈటీ నరసింహ మాట్లాడుతూ నగరంలో 1400 మురికివాడలు ఉన్నా ఇక్కడి పేదలకు ఇంత వరకూ డబుల్ బెడ్ రూమ్‌లను నిర్మించలేదని అన్నారు. సర్వోదయ మండలి ప్రధానకార్యదర్శి ఆర్ శంకర్ నాయక్, సభ్యురాలు చాయాదేవి తదితరులు మాట్లాడారు.
చిత్రం... సీపీఐ ధర్నాలో మాట్లాడుతున్న చాడ వెంకట రెడ్డి