రాష్ట్రీయం

స్వలాభం కోసమే బాబు టూర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 15: గడచిన ఐదేళ్లలో చంద్రబాబు రూ.39 కోట్ల ప్రజాధనంతో 38 విదేశీ పర్యటనలు జరిపారని, ఈ పర్యటనలు ఆయనకు, ఆయన కుటుంబానికి మాత్రమే ప్రయోజనం కలిగించి ప్రజలపై మాత్రం పెనుభారం మోపటం మినహా రాష్ట్రానికి జరిగిన లాభం శూన్యమని శాసనసభలో సోమవారం అధికార వైసీపీ సభ్యులు ధ్వజమెత్తారు. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు కాకాని గోవర్ధన్‌రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అడిగిన ప్రశ్నపై దాదాపు అరగంట సేపు చర్చ జరిగింది. సభ్యుల ప్రశ్నలకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి బదులిస్తూ గత ఐదేళ్లలో సీఎం, మంత్రుల విదేశీ పర్యటనల వల్ల రూ. 39 కోట్లు ఖర్చయిందన్నారు. 16 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నారు. 31 ప్రతిపాదనలు కార్యరూపం దాల్చినట్లుగా ఆర్థికాభివృద్ధి మండలి తెలియజేసిందన్నారు. కాకాని గోవర్ధనరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు 2014 నవంబర్‌లో సింగపూర్, 2015 జనవరిలో దావోస్, ఏప్రిల్‌లో చైనా 2016 మార్చిలో లండన్, తరువాత చైనా, ఖజకిస్తాన్, 2017 జనవరిలో శ్రీలంక, అక్టోబర్‌లో లండన్, తరువాత దుబాయ్, దక్షిణ కొరియా, 2018లో మళ్లీ దావోస్ వెళ్లి ఎక్కడికక్కడ అసాధ్యమైన హామీలు, ప్రకటనలు చేసారన్నారు. అసలు వీటి ప్రతిపాదనలు ఎక్కడ ఉన్నాయని గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై మంత్రి గౌతంరెడ్డి స్పందిస్తూ విదేశీ పర్యటనలతో జరిగిన ప్రజాధనం దుర్వినియోగంపై లోతుగా విచారణ జరిపిస్తున్నామన్నారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ ఇరుగు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులు ఎప్పుడైనా విదేశీ పర్యటనలు చేశారా అని ప్రశ్నించారు. ఈ దేశంలో ఏ సీఎం కూడా ఇలా తిరగలేదన్నారు. దేశ ఐటీ ఎగుమతుల్లో తమిళనాడు 10 శాతం ఉన్నా ఏనాడు చెప్పుకోలేదన్నారు. 45 వాతం ఐటీ ఎగుమతులున్న కర్నాటక కూడా ఏనాడూ
ప్రచారం చేసుకోలేదన్నారు. అయితే బాబు మాత్రం అసలు కంప్యూటర్లు తనవల్లనే వచ్చాయంటూ గొప్పలు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. అనంతపురంలో కియా మోటార్స్ కంపెనీ రావటానికి దివంగత వైఎస్ కారణమంటూ ఆ సంస్థ సీఈఓ హ్యాంగ్ క్యూనేలీ గత జూన్ 13వ తేదీ సీఎం జగన్‌ను అభినందిస్తూ రాసిన లేఖలో పేర్కొన్నారంటూ ఆ లేఖను చదివి విన్పించారు. ఇదే లేఖలో ఆయన వైఎస్‌తో అనుబంధం జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 2007లో తాను హూండాయ్ ఆర్ అండ్ డీకి హెడ్‌గా ఉన్నప్పుడు ఏపిలో ఆటో మొబైల్ పరిశ్రమ పెట్టమని కోరారని అన్నారు. అలనాటి ఆయన కోర్కె మేరకే అనంతపురంలో కియా మోటార్స్ ఏర్పాటు చేశానని చెప్పి ఎక్కడా బాబు ప్రస్తావనే లేదనగా అధికారపక్ష సభ్యులు బల్లలు చరుస్తూ హర్షధ్వానాలు చేశారు. ఈడీబీ ర్యాంకుల గురించి మంత్రి బుగ్గన సమాధానమిస్తూ ప్రశ్నలకు సంబంధించి ర్యాంకులు ఇవ్వటమే తప్ప పెర్ఫార్మన్స్ బట్టి ఇచ్చేది కాదన్నారు. ఆ రకంగా చేస్తూ అత్యంత అవినీతి రాష్ట్రాల్లో ఏపీ నంబర్ 1 అని ఎన్‌సీఈఆర్ సర్వేలోనూ వెలుగులోకి వచ్చింది కదా అన్నారు.
చిత్రం... సభలో మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి