రాష్ట్రీయం

నేడు సీతారాముల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఏప్రిల్ 14: లోక కళ్యాణకారకుడు జగదభిరాముని కల్యాణ గడియలతోభద్రాద్రి దేదీప్యమానంగా శోభిల్లుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం రంగుల దీపాలు, తాటాకు పందిళ్లతో కళకళలాడుతోంది. భద్రాద్రిలో గురువారం రాత్రి ఎదుర్కోలుతో సీతారాముల కల్యాణానికి సన్నాహాలు పూర్తయ్యాయి. శుక్రవారం అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి మిథిలానగరాన్ని సకల హంగులతో తీర్చిదిద్దారు. తలంబ్రాలు, లడ్డూలను సిద్ధం చేశారు. తాగునీటి సమస్య రాకుండా పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీరామనామ స్మరణతో భక్తులు పులకించిపోతున్నారు.
భద్రాచలంతో పాటు పర్ణశాలలోనూ సీతారాముల కళ్యాణ ఏర్పాట్లను ఘనంగా చేశారు. భద్రాద్రిలో జరిగే కల్యాణానికి ప్రభుత్వ పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఉదయం 10.45 నిముషాలకు హెలీకాప్టర్‌లో ముఖ్యమంత్రి భద్రాచలం చేరుకుంటారు. 11 గంటలకు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలతో మిథిలాస్టేడియంలో కల్యాణ వేదిక వద్దకు వస్తారు. సిఎంతో పాటు రాష్ట్ర మంత్రులు పలువురు వస్తున్నారు. ఇదిలావుండగా గురువారం రాత్రే భారీగా తరలివచ్చిన భక్తులకు సరిపడా వసతి సౌకర్యాలను కల్పించారు.
ఈసారి శ్రీరామనవమికి 1.50 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ లోకేశ్‌కుమార్ కల్యాణ ఏర్పాట్లను ఇప్పటికే సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని ఆర్టీసీ డిపోల నుంచి సుమారు 500 బస్సులను భద్రాద్రికి తిప్పుతున్నారు.
కల్యాణం
వసంతపక్ష ప్రయుక్తంగా నవాహ్నిక దీక్షతో జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన మహోత్సవం సీతారాముల కల్యాణం. ఈ వివాహ వేడుక దుర్ముఖనామ సంవత్సర చైత్రశుద్ధ శ్రీరామనవమి శుక్రవారం అభిజిత్ లగ్నంలో 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగుతుంది. కల్యాణ మహోత్సవాన్ని జరిపించేందుకు దైవజ్ఞులు ఈ శుభ ముహూర్తాన్ని నిర్ణయించారు. శ్రీరామచంద్ర స్వామి జన్మ నక్షత్రం నాడే ఈ పెళ్లి క్రతువు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
కల్యాణం మరికొద్ది గంటల్లో జరగనున్న నేపథ్యంలో గురువారం రాత్రి ఆలయ సమీపంలో జరిగిన ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా జరిగింది. వరుడు బంధువులతో వచ్చే సమయంలో పొలిమేర నుంచి కన్యాదాత స్వాగతం పలికే వేడుకే ఈ ఎదుర్కోలు. అమ్మవారి తరుపున స్థలసాయి, రాముల వారి తరుపున వేద పండితులు ఉండి ఈ ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు.

చిత్రం విద్యుద్దీపాలంకరణతో అలరారుతున్న భద్రాచలం క్షేత్రం