రాష్ట్రీయం

మీ అప్పుల సంగతి తేలుద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి : తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పేరుతో చేసిన లక్షల కోట్ల రూపాయల అప్పుల సంగతి తేలుద్దామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం శాసనసభలో వార్షిక బడ్జెట్‌పై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపణలపై మంత్రి ప్రతిస్పందించారు. ఆదాయంపై గత మూడేళ్లుగా చేపల లెక్కలు చెప్తున్నారని వ్యంగ్యంగా అన్నారు. చంద్రన్న కానుకల అప్పు కూడా తమ ప్రభుత్వం చెల్లించాలా అని నిలదీశారు. కియా కంపెనీకి సంబంధించి 2007లోనే నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లేఖ రాశారని గుర్తుచేశారు. ఖరీఫ్‌కు విత్తనాలు మే నెలకల్లా పంపిణీ చేయాల్సి ఉంటే మూడు రోజులు ఆలస్యమైనందుకు తమ ప్రభుత్వంపై నిందలు మోపడం దుర్మార్గమన్నారు. ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ గృహాలు, పింఛన్లు తదితర సంక్షేమ కార్యక్రమాలన్నీ వైఎస్ ప్రవేశపెట్టినవే అన్నారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణ పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. పట్టిసీమను తాము వ్యతిరేకించటంలేదని అందులో జరిగిన అవకతవకలనే ప్రశ్నిస్తున్నామని
స్పష్టం చేశారు. ఒకే విడత మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అమలు చేయగలరా అని ప్రశ్నించారు. విద్యా రంగానికి తమ ప్రభుత్వం రూ. 8వేల కోట్లు కేటాయిస్తే టీడీపీ 3600 కోట్లు పెట్టిందని, రాజధానికి ఐదేళ్లలో రూ. 15 వందల కోట్లు కేటాయిస్తే మరో 15 వందల కోట్లు కేంద్రం మంజూరు చేసిందని గుర్తుచేశారు. అమరావతి మెట్రోకు రూ. 403 కోట్లకు గాను కేవలం 7 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. రాజధానిలో ప్రతి రోడ్డు నిర్మాణంలో అవినీతి జరిగిందని, కిలోమీటరుకు రూ. 32 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు ఎవరు పెంచారో తెలుసు కోవాలన్నారు. డ్వాక్రా మహిళలకు ఐదేళ్లలో వడ్డీ మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు.