రాష్ట్రీయం

వాటిని కూల్చొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: సచివాలయంతో పాటు ఎర్రమంజిల్‌లో హెరిటేజ్ భవనాన్ని కూల్చకుండా ఆపాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు అఖిల పక్ష నేతల బృందం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రభుత్వ ఆస్తులకు కస్టోడియన్‌గా ఉన్న సర్వాధికారాలను వినియోగించి కూల్చివేతలను ఆపాలని అఖిల పక్షం కోరింది. ప్రజాస్వామిక తెలంగాణ వేదిక అధ్యక్షుడు వివేక్ ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జీవన్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, బీజేపీ నేతలు డీకే అరుణ, చింతల రామచంద్రారెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్, సిఎల్ విశే్వశ్వర్‌రావు, పీఓడబ్ల్యు నాయకురాలు సంధ్య తదితరుల బృందం గవర్నర్‌ను కలిసింది. ప్రస్తుతం సచివాలయం మరో 60, 70 ఏళ్ల వరకు కూడా
వినియోగించుకోవడానికి అనుగుణంగా నిర్మాణాలు పటిష్టంగా ఉన్నాయని గవర్నర్‌కు వివేక్ వివరించారు. అవసరం లేకపోయినా ఉన్న భవనాలను కూల్చి కొత్త భవనాలను నిర్మించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకపక్షంగా, నియంతలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్న సీఎం కేసీఆర్ నిర్ణయాలను అడ్డుకోవాలని కోరారు. గవర్నర్ రాష్ట్రానికి సీఈవోలాంటి వారని, ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలకు అడ్డుకట్టవేయాల్సిన బాధ్యత తమరిదేనని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిందని, ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సలు చేసిన ఆస్పత్రులకు బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో కొత్త సచివాలయం అవసరమా? అని కోదండరామ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి జోక్యం చేసుకుంటూ తమ విజ్ఞప్తికి న్యాయం చేస్తారన్న పూర్తి విశ్వాసం ఉందన్నారు. ప్రొఫెసర్ పీఎల్ విశే్వశ్వర్‌రావు మాట్లాడుతూ, సచివాలయం, ఎర్రమంజిల్‌లో హెరిటేజ్ భవనం కూల్చివేతపై హైకోర్టులో 17 ప్రజావ్యాజ్యాలు విచారణలో ఉన్నాయన్నారు. విచారణ పూర్తి అయ్యేవరకైనా కూల్చివేతలను చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. ఉన్న భవనాలను కూల్చేసి కొత్తగా మళ్లీ నిర్మిస్తామంటూ సీఎం కేసీఆర్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
మమ్మల్ని కూడా పట్టించుకోండి!
అఖిల పక్ష బృందం తనను కలిసినప్పుడు రేవంత్‌రెడ్డి, షబ్బీర్ అలీని ఉద్దేశించి ‘ఏం రేవంత్...ఏం షబ్బీర్ అలీ...ఏం జరుగుతుంది’ అంటూ వారిని గవర్నర్ పలికరించారు. ‘మీరు మమ్మల్ని ఎక్కడ చూస్తారు సార్, ఇద్దరు సీఎంలనే చూసుకుంటున్నారు’ అని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. గవర్నర్ నరసింహన్ వెంటనే స్పందిస్తూ‘మీరు ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ వేదికలపై చేసుకోండి, నా వద్ద కాదు’ అని అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మేము చెప్పేది నిజమే కదా సార్...మీరు రాష్ట్రాలను పట్టించుకోవడం లేదు కదా’ అని సమాధానం ఇచ్చారు. ‘అలా మాట్లాడవద్దు, నేను రాష్ట్రాలను కూడా చూస్తున్నా’ అని గవర్నర్ ప్రతి సమాధానం చెప్పారు. షబ్బీర్ అలీ తిరిగి స్పందిస్తూ తాము రాజకీయ నాయకులమని, రాజకీయాలే మాట్లాడుతామని వ్యాఖ్యానించారు. ఈ వాగ్వివాదం మరింత పెరగకుండా జానారెడ్డి జోక్యం చేసుకుంటూ, ‘గవర్నర్‌గా మీరున్నారని గుర్తిండి పోయేలా చేసి వెళ్లండి’ అని సూచించడంతో వాగ్వాదానికి తెరపడింది.