రాష్ట్రీయం

రేపు మంత్రి మండలి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మున్సిపల్ కొత్త చట్టం బిల్లు ఆమోదం కోసం రాష్ట్ర మంత్రిమండలి బుధవారం సమావేశం కానుంది. మున్సిపల్ చట్టం ఆమోదం కోసం ఈ నెల 18, 19న శాసనసభ, శాసనమండలి ప్రత్యేకంగా సమావేశం కానున్న విషయం తెలిసిందే. శాసనసభ భేటీకి ముందే ఈ చట్టంపై మంత్రిమండలి చర్చించి బిల్లుకు ఆమోదించాల్సి ఉంది. రెండు రోజు శాసనసభ సమావేశాలు ప్రత్యేకంగా మున్సిపల్ చట్టం కోసమైనప్పటికీ మంత్రిమండలి సమావేశంలో మాత్రం పలు తాజా అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. విభజన అంశాలు, నదీ జలాల పంపిణీ, ఉద్యోగులు విభజన, షెడ్యూల్ 9, 10 ఆస్తుల పంపిణీ తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత మంత్రి మండలి భేటీ కావడం ఇదే మొదటిసారి కావడంతో, దీనికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికలు తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.