రాష్ట్రీయం

నేతలూ..పారాహుషార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ కాక ముందే రాజకీయ పార్టీలు జాగ్రత్తగా మెలగాలని ఎన్నికల నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నికల ప్రక్రియ మంగళవారం నుండి ప్రారంభమవుతోంది. అన్ని మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల ఫోటో గుర్తింపు జాబితాను మంగళవారం ప్రకటిస్తున్నారు. ఇదే రోజు పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలను కూడా ప్రకటిస్తున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో మంగళవారం అంటే జూలై 16న ఈ రెండు జాబితాలను సంబంధిత అధికారులు నోటీస్‌బోర్డుపై వేస్తారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ రెండూ కీలకమైనవే. ఓటర్ల జాబితాల్లో తమ పేర్లు లేవంటూ సాధారణంగా పోలింగ్ రోజు సామాన్య ఓటర్లు ఆరోపిస్తుంటారు. రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో హల్ చల్ చేస్తుంటాయి. ఓటర్ల జాబితాలను పరిశీలించగానే, ఎవరి పేర్లు ఉన్నాయో, ఎవరిపేర్లు లేవో స్పష్టమవుతుంది. పేర్లు లేని వారు వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 17న రాజకీయ పార్టీల నేతలతో మీటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే పోలింగ్ కేంద్రాల జాబితాలను పరిశీలించిన తర్వాత ఈ నెల 19 వరకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదులపై ఈ నెల 20 న నిర్ణయం తీసుకుంటారు. అదే రోజు పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటిస్తారు. ఈ నెల 21న తుది జాబితా ప్రకటిస్తారు. కొత్త మున్సిపల్ చట్ట ప్రకారం మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో
గతంలో ఉన్న మున్సిపాలిటీల సంఖ్యతో పోలిస్తే తాజాగా వీటి సంఖ్య రెట్టింపయింది. వార్డుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దాంతో మున్సిపల్ చట్టంలో మార్పులు చేస్తున్నారు. వార్డుల వారీగా రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు. వీటన్నింటికీ ఆమోదం కోసం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మంత్రివర్గం ఆమోదం తెలిపిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఇందుకోసం ఒక బిల్లును ప్రతిపాదిస్తారు. అసెంబ్లీ ఆమోదం లభించగానే మార్పులు, చేర్పులతో కూడిన చట్టం అమల్లోకి వస్తుంది. మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశం చట్టం పరిధిలో ఉండాలి కాబట్టే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కొత్త చట్టానికి వీటికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ కావలసింది. ఆ తర్వాతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగి, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తుంది.