రాష్ట్రీయం

కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఇంటరాక్టివ్ అసిస్టెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: ఆంధ్రాబ్యాంకు ప్రధాన కార్యాలయంలో కృత్రిమ మేథస్సు(ఏఐ)తో పనిచేసే ఇంటరాక్టివ్ అసిస్టెంట్ - అభిని బ్యాంకు ఎండీ -సీఈఓ జే పకీరిసామి సోమవారం నాడు ప్రారంభించారు. కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఈ సహాయకారికి అభి అని పేరు పెట్టారు. దీనిని ప్రధాన కార్యాలయం ఆడిటోరియంలో ఉంచారు. ఆంధ్రాబ్యాంకు ఎపుడూ ఆధునికతను సంతరించుకుంటూనే ఉందని, అందులో భాగంగానే చాట్‌బాట్‌గా అభిని ఏర్పాటుచేశామని ఆయన పేర్కొన్నారు. రోజంతా ఖాతాదారుల అనుమానాలను ఇది నివృత్తి చేస్తుందని, అనుమానాలను అర్ధం చేసుకుని తదనుగుణమైన సమాచారాన్ని తిరిగి ఇచ్చేందుకు వీలుగా అభిలో సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం జరిగిందని ఆయన వివరించారు. ఆంధ్రాబ్యాంకు డాట్ ఇన్ అనే వెబ్ సైట్ ద్వారా ఖాతాదారులు అభితో అనుసంథానమై తమ అనుమానాలను తీర్చుకోవచ్చని చెప్పారు. ఫేస్ బుక్ మెసెంజర్, మొబైల్, డెస్క్‌టాప్ బ్రౌజర్‌తో పాటు గూగుల్ అసిస్టెంట్ వాయిస్ ద్వారా డిజిటల్ బ్యాంకింగ్, రుణాలు, బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ పథకాలు, ఇన్స్యూరెన్స్ సీనియర్ సిటిజన్లకు ఉపయుక్తమయ్యే సమాచారం, రూపీ ఆఫర్లు, ఆధార్ సేవలు, పేమెంట్ పద్ధతులు, డిపాజిట్లు, ఈఎంఐ లెక్కింపు, కస్టమర్ కంప్లైంట్ నమోదు, సమీపంలోని బ్రాంచి లేదా ఏటీఎం కేంద్రాల వివరాలు, ప్రీ పెయిడ్ మొబైల్ రీ ఛార్జి వంటి సదుపాయాలు లభిస్తాయి. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏకే రథ్, శ్రీకౌల్ భూషణ్ జైన్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
చిత్రం... ఆంధ్రాబ్యాంకు ప్రధాన కార్యాలయంలో కృత్రిమ మేధస్సు(ఏఐ)తో పనిచేసే ఇంటరాక్టివ్ అసిస్టెంట్, ఎండీ, సీఈఓ పకీరిసామి