రాష్ట్రీయం

90 రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 15: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించి ఏర్పాటైన నిపుణుల కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. రాష్ట్ర శాసన మండలిలో ఆర్టీసీలో అద్దె బస్సుల యజమానుల సమస్యలపై సోమవారం సభ్యుడు జి.శ్రీనివాసులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, ముందుగా ఉద్యోగుల విలీనానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అద్దె బస్సుల్లో సిబ్బంది గురించి ఆలోచించలేమన్నారు. అద్దె బస్సుల ఒప్పందాన్ని నిబంధనల మేరకు పొడిగిస్తామన్నారు.
యువత నక్సల్స్‌వైపు ఆకర్షితులవుతున్నారు
గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల లీజుపై సభ్యుడు జంగా కృష్ణమూర్తి అడిగిన ప్రశ్నపై జరిగిన చర్చలో టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాట్లాడుతూ పల్నాడు ప్రాంతం వెనుకబడి ఉందన్నారు. దీనిని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఉపాధి అవకాశాలు లేక యువత నక్సల్స్‌వైపు ఆకర్షితులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువతను ఆ వైపు వెళ్లకుండా చూడాల్సి ఉందన్నారు. మంత్రి గౌతం రెడ్డి స్పందిస్తూ, వచ్చే ఐదేళ్లలో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం తీసుకురానున్నామని వెల్లడించారు. సభ ప్రారంభం కాగానే రాష్ట్రంలో శాంతిభద్రతలు, టీడీపీ కార్యకర్తలపై దాడుల గురించి చర్చించాలని టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ షరీఫ్ తిరస్కరించారు. టీడీపీ సభ్యులపై దాడులు, మచిలీపట్నంలో ఆశా వర్కరు ఆత్మహత్యాయత్నం తదితర అంశాల నేపథ్యంలో చర్చ జరపాలని పట్టుబట్టారు. దీనిని చైర్మన్ అనుమతించలేదు. వేరే ఫార్మాట్‌లో వస్తే చర్చకు అనుమతిస్తామని స్పష్టం చేశారు.