రాష్ట్రీయం

నేడు శ్రీవారి ఆలయం మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 15: చంద్రగ్రహణం కారణంగా మంగళవారం రాత్రి 7 నుంచి బుధవారం తెల్లవారు జామున 5 గంటల వరకు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం తలుపులు మూసివేస్తారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ సోమవారం ఒక ప్రకటనలో కోరింది. 17వ తేదీ ఉదయాత్పూర్యం 1.31 నుంచి 4.29 గంటల వరకు చంద్ర గ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభం అవుతుంది.
నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 17వ తేదీ ఆణివార ఆస్థానం సందర్భంగా మంగళవారం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేవలం ఐదు గంటలు మాత్రమే భక్తులకు దర్శన సమయం ఉంటుంది. ఈ కారణంగా 15వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు రద్దీని అనుసరించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్‌లలోనికి భక్తులను అనుమతించినా వారికి 16వ తేదీ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనం కల్పిస్తారు. 16వ తేదీ భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి అనుమతించరు. అలాగే శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, చంద్ర గ్రహణం కారణంగా 16వ తేదీన దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. వయో వృద్ధులు, దివ్యాంగులు, సుపథం ద్వారా సంవత్సరంలోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు, దాతలకు కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాలను మంగళవారం టీటీడీ రద్దు చేసింది. ఈరోజు నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడ సేవను కూడా రద్దు చేసింది. అలాగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతోపాటు, చంద్రగ్రహణం కారణంగా అష్టదళపాద పద్మారాధన, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి. 17వ తేదీ ఆణివార ఆస్థానం కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే తిరుమల శ్రీవారి ఆలయంలో 17వ తేదీ తెల్లవారు జామున భక్తులకు కల్పించే అంగప్రదక్షణను కూడా రద్దుచేసి, ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. గ్రహణం కారణంగా 16వ తేదీ రాత్రి 7 నుంచి 17వ తేదీ ఉదయం 9 గంటల వరకు అన్నప్రసాదాల వితరణ ఉండదు. 9 గంటల తరువాత అన్నప్రసాదాలను భక్తులకు అందిస్తారు. అయితే 16వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు తిరుమలలోని అన్నప్రసాద వితరణ కేంద్రాలు, నాదనీరాజనం వేదిక, మ్యూజియం వద్ద, వైభవోత్సవ మండపం ప్రాంగణంలో భక్తులకు 20వేల పులిహోర, టమోటా అన్నం ప్యాకెట్లను అందిస్తారు.