రాష్ట్రీయం

అంతా ఓపెనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, జూలై 16: కడప జిల్లా రాయచోటిలో మంగళవారం జరిగిన ఓపెన్ డిగ్రీ పరీక్షలు పరీక్షల విధానానికే మచ్చతెచ్చేలా సాగాయి. కొంతమంది అభ్యర్థులు సెల్‌ఫోన్లు, పుస్తకాల్లో చూసి సమాధానాలు రాయగా, మరికొంత మంది ఏకంగా ప్రశ్నపత్రాలను ఇళ్లకు తీసుకువెళ్లి తాపీగా సమాధానాలు రాసి తెచ్చిఇవ్వడం గమనార్హం. ఇదేమీ పట్టని ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్ పాటలతో కాలక్షేపం చేయడం మిరంత విడ్డూరం. వివరాల్లోకి వెళ్తే శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ అనుమతితో ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాయచోటి పట్టణంలోని మదనపల్లె మార్గంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్నాయి. రాయచోటి, కలకడకు చెందిన ప్రైవేటు డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఇక్కడ పరీక్షలు రాస్తున్నారు. పరీక్షల నియమ నిబంధనల మేరకు విద్యార్థులను తనిఖీలు చేసి వారు ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లకుండా చూడాలి. అయితే నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి విద్యార్థులు పుస్తకాలు, సెల్‌ఫోన్లు పరీక్ష హాలులోకి తీసుకెళ్లినా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించారు. ఒకే బెంచీలో ఐదుగురు విద్యార్థులను కూర్చోబెట్టారు. ఈ కేంద్రంలో సుమారు 1300 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేసి వారికి ప్రశ్నాపత్రాలతో పాటు సమాధానాల మెటీరియల్స్ కూడా అందజేస్తున్నారు. మంగళవారం ఏకంగా ప్రశ్నపత్రం, సమాధానపత్రాలను విద్యార్థులకు ఇచ్చి బయటకు పంపారు. దీంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లి తాపీగా సమాధానాలు రాసి సమయానికి తీసుకెళ్లి పరీక్ష హాలులో ఇన్విజిలేటర్లకు అందజేశారు. యూనివర్శిటీ అధికారులు తనిఖీలు చేయకుండా పరీక్ష కేంద్రం బయట సెల్‌ఫోన్లలో పాటలు వింటూ కాలక్షేపం చేస్తూ కనిపించారు. పరీక్ష కేంద్రంలో హాల్‌టికెట్లను పరిశీలిస్తే 50 శాతం వరకు డమీ విద్యార్థులే కనిపించారు. ఈ విషయం యూనివర్శిటీ అధికారులకు తెలిసినా కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద రాయచోటిలో జరిగిన ఓపెన్ పరీక్షలు ప్రహసనంగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చిత్రం...సెల్‌ఫోన్, పుస్తకం పెట్టుకుని పరీక్ష రాస్తున్న దృశ్యం