రాష్ట్రీయం

మాట్లాడేందుకు మాకూ అవకాశం ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ) : రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు, నేతలపై దాడులు పెరిగాయని దీనిపై చర్చించేందుకు వాయిదా తీర్మానానికి అనుమతించాలంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పట్టుబట్టారు.
వైసీపీ ప్రభుత్వం ఆధికారంలోనికి వచ్చిన తరువాత టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులపైన దాడులు పెరిగాయని, అకారణంగా అనేక మందిని పొట్టన పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల మందికి అపాయం ఉన్న సమస్యపై చర్చించేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం సభలో ప్రశ్నోత్తరాల సమయం దాటిన తరువాత టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు చెప్పిన స్పీకర్ తమ్మినేని సీతారాం 20 నిముషాల పాటు సభను వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తరువాత టీడీపీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానంపై చర్చ జరగాలని పట్టుబట్టారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ ఒకసారి తీర్మానాన్ని తిరస్కరించిన తరువాత చర్చకు ఆస్కారం లేదన్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టి, నినాదాలు చేశారు.
వాయిదా తీర్మానం తిరస్కరించినందున మరో సారి వేరే విధంగా నోటీసు ఇవ్వాలని స్పీకర్ సూచించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటీసులను స్పీకర్ కార్యాలయం సిబ్బందికి ఇచ్చామని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. కానీ స్పీకర్ వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతి ఇవ్వకపోడంతో ఒక్కసారి ప్లీజ్...ఒకే ఒక్కసారి...ఒక్క నిమిషం మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పదే పదే విజ్ఞప్తి చేస్తూ నినాదాలు చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం సభ్యులను ఒప్పించే ప్రయత్నం చేయడంతో పాటు సీనియర్లు కొంత మంది ఉన్నారు కదా.. మరో సారి వేరే విధంగా తీర్మానంతో రండి అంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. పయ్యావుల కేశవ్ మాత్రం స్పీకర్ కార్యాలయంలో నోటీసులు ఇచ్చాము.. ఇప్పుడు అనుమతి ఇవ్వండి.. లేని పక్షంలో ఎప్పుడు ఇచ్చేది చెప్పాలన్నారు. దీనిపై స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసును పరిశీలించిన తరువాత నిర్ణయం చెబుతానన్నారు. కానీ ఇప్పుడు సభలో అనుమతించడం కుదరదన్నారు. ఎప్పుడు అనుమతించేంది కూడా ఇప్పుడే చెప్పలేనన్నారు. మధ్యలో కలగజేసుకున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభలో వాయిదా తీర్మానం తిరస్కరణ తరువాత, నోటీసులు ఇచ్చినప్పుడు ఎలా ఉండాలో చెప్పే అసెంబ్లీ రూల్స్‌ను చదివి వినిపించారు.
సభలో అందరికీ ఒకే రూల్ ఉండాలి కానీ, అధికార పక్షానికి ఒక రూలు, ప్రతిపక్షానికి ఒక రూలు ఉండకూడదు అంటూ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అడ్డుతగిలారు. స్పీకర్‌తో పాటు అధికార పార్టీ సభ్యులు ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాసేపు వాదోపవాదనలు జరిగిన తరువాత స్పీకర్ మరోసారి సర్దిచెప్పి మాట్లాడేందుకు అవకాశం వస్తుంది.. కాస్త ఆలోచించాలి అని చెప్పడంతో టీడీపీ ఎమ్మెల్యేలు శాంతించి కూర్చోవడంతో సభలో బడ్జెట్‌పై చర్చను ప్రారంభించారు.