రాష్ట్రీయం

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: ఇళ్లు లేని నిరుపేదలపై నయాపైసా భారం మోపకుండా ఉచితంగా ఇచ్చే డబుల్ బెడ్‌రూమ్ పథకం కింద నిర్మించిన లక్షా 23 వేల ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నా, మున్సిపల్ ఎన్నికలు అడ్డంకిగా మారింది. మున్సిపల్ ఎన్నికల కోడ్ ఇంకా అమలులోకి రాకపోయినా ఆ దిశగా ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతుండటంతో ప్రారంభోత్సవాలను ఎన్నికలు ముగిసిన తర్వాతనే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఇలావుంటే, తొలి విడతలో 18 వేల 520 కోట్ల వ్యయంతో గేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో సహ రాష్టవ్య్రాప్తంగా 2,80,616 ఇళ్లను మంజూరీ చేసింది. వీటిలో ఇప్పటికే 2,38,926 ఇళ్లకు టెండర్లు ఆహ్వానించి 1,99,835 ఇళ్ల నిర్మాణానికి టెండర్లను ఖరారు చేసింది. ఇందులో 1,79,078 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టగా 1,23,314 ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది. వందశాతం పూర్తి అయిన వాటిలో 32,008 ఇళ్లు, 90 శాతం నిర్మాణం పూర్తి అయిన వాటిలో 91,306 ఇళ్లు, వివిధ దశలో 55,764 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. తొలి విడత డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి రూ.18,520 కోట్లుగా అంచనా వేయగా, ఇప్పటి వరకు పూర్తి అయిన ఇళ్లకు రూ.6,141 కోట్లు ఖర్చు చేసినట్టు తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ అధికారిక సమాచారం. నిధులు కొరత వల్ల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం ఆగిపోయినట్టు జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని కూడా గృహ నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. కాంట్రాక్టర్లు బిల్లు సమర్పించిన 15 రోజులలోనే నిధులను విడుదల చేస్తోంది. బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నివారించేందుకు ఆన్‌లైన్ ప్రాజెక్టు మానిటరింగ్ సిస్టమ్‌ను సంస్థ అమలు చేస్తోంది. కాంట్రాక్టర్ సమర్పించిన బిల్లులను ఆన్‌లైన్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పరిశీలించాక క్షేత్రస్థాయిలో ఏఈ, డీఈఈలు జరిగిన పనిని పరిశీలించి తిరిగి వెబ్‌సైట్‌లో పొందుపర్చగానే కాంట్రాక్టర్ ఖాతాలో బిల్లుకు సంబంధించిన డబ్బులు జమ చేసే విధానాన్ని గృహ నిర్మాణ సంస్థ అమలు చేస్తోంది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల డిజైనింగ్, లే అవుట్లలో సృజనాత్మకత, ఆన్‌లైన్ ప్రాజెక్టు మానిటరింగ్ సిస్టమ్‌కు హడ్కో జాతీయ స్థాయి అవార్డును రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకు బహుకరించింది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అతి చౌకగా నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు ముందుకురాని విషయం తెలిసిందే. అయితే కాంట్రాక్టర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సహకాలను ప్రకటించింది. సిమెంట్ కంపెనీలతో చర్చించి బస్తా సిమెంట్‌ను రూ.230కే కాంట్రాక్టర్లకు ఇచ్చే ఏర్పాటు చేసింది. అలాగే నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ఉచితంగా ఇవ్వడంతో పాటు వీటిపై సీనరేజి చార్జీలను రద్దు చేసింది. గృహ నిర్మాణానికి అవసరమైన స్టీల్‌ను ఒప్పందం చేసుకున్నప్పుటి ధరకే అందించే విధంగా పెరిగిన ధరల వ్యత్యాసాన్ని ప్రభుత్వమే భరించే విధంగా ప్రొత్సాహకాన్ని అందిస్తోంది. కాంట్రాక్టు పొందడానికి చెల్లించాల్సిన ఇఎండి మొత్తాన్ని 2.5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించింది. బిల్లుల చెల్లింపులో డిపాజిట్‌గా పెట్టుకునే మొత్తాన్ని 7.5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది. నిర్మాణ పని పూర్తి అయిన తర్వాత విడుదల చేయాల్సిన డిపాజిట్‌ను తిరిగి చెల్లించే కాలాన్ని 2 ఏళ్ల నుంచి ఏడాదికి కుదించింది.
చిత్రం...ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు