రాష్ట్రీయం

తగ్గిన నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ విద్యాశాఖ అధికారుల తీరే వేరు. దేశం మొత్తం ఒక విధంగా స్పందిస్తే, వీరు మాత్రం మరోలా వ్యవహరిస్తారు. కేంద్ర బడ్జెట్‌పై కనీస అవగాహన కూడా లేని కారణంగా, విద్యా శాఖకు నిధులు తగ్గిపోయాయి. కేంద్రప్రభుత్వం వివిధ పథకాల కింద నిధులు జారీ చేసే ముందు రాష్ట్రాలకు ప్రతిపాదనలు పంపించమని కోరుతుంది. సాధారణంగా ఆ ప్రతిపాదనలు రూపొందించే దశలో అధికారులు పది రూపాయిలు కావాలనుకుంటే వంద రూపాయిలు కావాలని ఎక్కువ మొత్తం కేంద్రం నుండి రాబట్టుకోవడానికి ప్రతిపాదనలు పంపిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో రాష్ట్ర వాటా, కేంద్రం వాటా కూడా ఉంటుంది, అలాంటి సమయాల్లోనూ రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఎక్కువ మొత్తానికే ప్రతిపాదనలు పంపిస్తుంటారు. కానీ, తెలంగాణ అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. సహిత విద్య అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కోరితే పాత కాగితాలనే పంపించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు! ఇక్కడి అధికారులు పంపిన ప్రతిపాదనలను కేంద్రం యథాతథంగా ఆమోదించింది. అంటే ఎక్కువ నిధులు ఇస్తాం మొర్రో అని కేంద్రం అంటున్నా, అవి తీసుకోవడానికి రాష్ట్ర అధికారులు సిద్ధంగా లేదన్నమాట. ఇదేం విడ్డూరమని స్పెషల్ ఎడ్యుకేటర్స్ వాపోతున్నారు. తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న 1,184 మంది సహిత విద్య ఉపాధ్యాయులు, 1,766 మంది క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, 467 మంది ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, 467 కంప్యూటర్ ఆపరేటర్లు, 467 మంది మెసెంజర్లు మొత్తం 3,167 మంది, సుమారు 2,300 మంది పీటీఐలు పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వీరి వేతనాల ప్రతిపాదనల కింద గత ఏడాది పంపిన ప్రతిపాదనలనే 2019-20 సంవత్సరానికి కూడా పంపింది. కనీసం బడ్జెట్‌లో పెరిగే 10 శాతం మొత్తాన్ని కూడా పెంచకుండా ఈ ప్రతిపాదనలను పంపడం విచిత్రం. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే సహిత విద్యా సిబ్బందికి తక్కువ వేతనాలను చెల్లిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు సగటున 30 నుండి 50వేల రూపాయల వరకు ఇస్తున్నారు. సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని 2016 అక్టోబర్ 26న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా తీర్పును మాత్రం రాష్ట్రంలో అమలుచేయడం లేదని నేషనల్ కన్వీనర్ కల్పగిరి శ్రీను ఆరోపించారు. కాంట్రాక్టు సిబ్బంది పేరుతో క్యాజువల్‌సిబ్బంది పేరుతో, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది , తాజాగా గెస్టు సిబ్బంది పేరుతో దగా చేస్తోందని అన్నారు. పని ఒకటే అయినపుడు సమాన వేతనం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఇప్పటికైనా వేతన సవరణలు చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు పంపించాలని ఆయన హితవు పలికారు.