రాష్ట్రీయం

రేపటి నుండి భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఈ నెల 18 నుండి 20 వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వచ్చిన వాతావరణ మార్పుల కారణంగా నైరుతీ రుతుపవనాలు బలంగా మారుతున్నాయన్నారు. తెలంగాణతో పాటు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇలావుంటే, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం చాలా చోట్ల భారీగా వర్షం కురిసింది. ఎల్‌బీ నగర్‌లో నాలుగు సెంటీమీటర్లు, ఉప్పల్‌లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోని చాలా చోట్ల ఒక మోస్తరు నుండి భారీగా వర్షం కురిసింది. రహదారులు జలమయం కావడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. ఇలావుండగా గత 24 గంటల్లో నేరేడుచర్ల (సూర్యాపేట) లో ఐదు సెంటీమీటర్లు, ఇబ్రహీంపట్నంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చెల్, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్లగొండ తదితర జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.

చిత్రం...హైదరాబాద్‌లో మంగళవారం కురిసిన భారీ వర్షానికి వాహనదారుల అవస్థలు