రాష్ట్రీయం

సామాన్య భక్తులకే ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి : శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య భక్తులకు త్వరితగతిన, సంతృప్తికరంగా స్వామివారి దర్శనం కల్పించాలన్నదే తమ ఆలోచన టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం శ్రీవారి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో పాల్గొన్న ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ సంఖ్యావర్గీకరణ వీఐపీ దర్శన విధానాలపై న్యాయ స్థానం కూడా అభ్యంతరం చెబుతోందన్న విషయాన్ని విలేఖరులు ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఆయన స్పందిస్తూ న్యాయస్థానాలు చెప్పేంత వరకు తాను వేచి ఉండటం లేదని, ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 విధానాలను కచ్చితంగా మారుస్తామని, ఇందులో మరో ఆలోచనకు తావులేదన్నారు. ఈఓ, జేఈఓలతో కూడా తాను రెండు రోజుల క్రితం చర్చించానన్నారు. శ్రీవారి ఆలయంలో దర్శన విధానాల్లో మార్పులు తీసుకురావాలని పౌరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితి వస్తున్నప్పుడు వారి మనోభావాలను గౌరవించి తగు రీతిలో విధానాల్లో మార్పులు తీసుకురావడం తమ బాధ్యతన్నారు. రెండు మూడు రోజుల్లో వీఐపీ దర్శనాల్లో కచ్చితమైన మార్పులు చేస్తామన్నారు. ఇందులో ప్రోటోకాల్ వీఐపీలకు, సాధారణ వీఐపీలకు ప్రత్యేక దర్శనం కల్పించాలన్న విధివిధానాలను, మార్గదర్శకాలను రూపొందిస్తామన్నారు. అవసరమైతే గురువారం నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తామని ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి తనతో చెప్పారన్నారు. మొత్తం మీద వీఐపీల సంఖ్యాశాస్త్ర వర్గీకరణాలకు చంద్రగ్రహణం రోజున గ్రహణం వీడటం ఖాయమని తేలిపోయింది.