రాష్ట్రీయం

సాంకేతిక లోపంతో ఇండిగో విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ఇండిగో విమానం గాలిలో చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఇండిగో విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన విమానం గాలిలోకి ఎగిరిన తర్వాత విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన ఫైలట్‌లు గుర్తించారు. దీంతో విమానాన్ని కాసేపు ఆకాశంలోనే చక్కర్లు కొట్టించారు. దీంతో ప్రయాణికులు ఏమి జరుగుతుందోనన్న ఉత్కంఠ కాసేపు భయభ్రాంతులకు గురయ్యారు. ఆకాశంలో చక్కర్లు కొట్టిన విమానం ఎట్టకేలకు తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో ఆకాశంలో చక్కర్ల మీద చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.