రాష్ట్రీయం

జిల్లాల అభివృద్ధి మీ చేతుల్లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: జిల్లాల అభివృద్ధిలో జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్లు కీలక భూమిక నిర్వర్తించాలని, జిల్లా స్థాయిలో చేపడుతున్న అన్ని అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలపై రివ్యూ చేయవచ్చని రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్ జీ. రాజేశంగౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమిషన్ నేతృత్వంలో జడ్పీపీ చైర్‌పర్సన్ల సమావేశం బుధవారం హైదరాబాద్ (హరిత ప్లాజా)లో జరిగింది. ఈ సందర్భంగా రాజేశంగౌడ్ మాట్లాడుతూ, గ్రామసీమలే దేశానికి పట్టుగొమ్మలని, స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీలు, మండల ప్రజాపరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తులు తమ
తమ పరిధిలో నిబంధనల మేరకు పనిచేయాలని సూచించారు. జిల్లాల అభివృద్ధిలో జడ్పీపీ చైర్‌పర్సన్లు కీలకభూమిక నిర్వర్తించాలని, జిల్లాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఎంపీపీ, గ్రామ పంచాయతీల బడ్జెట్‌లను కూడా జడ్పీపీ చైర్‌పర్సన్లు సమీక్షించవచ్చని, వ్యవసాయ, విద్య, ఆరోగ్యం తదితర రంగాల్లో కూడా సంబంధిత జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించవచ్చని రాజేశం గౌడ్ పేర్కొన్నారు. తరచూ పాఠశాలలకు వెళుతూ తనిఖీ చేయాలని సూచించారు. జడ్పీపీలకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని రాజేశంగౌడ్ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్ని నిధులు కేటాయిస్తే అందుకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. పంచాయతీరాజ్ పరిపాలన ప్రజలకు దగ్గరగా ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ తెలిపారు. బడ్జెట్‌లో 1600 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్‌కు కేటాయించారని గుర్తు చేశారు. పంచాయతీరాజ్ కొత్త భవనాలకు, వాహనాల కొనుగోలుకు త్వరలోనే అనుమతులు వస్తాయని పంచాయతీరాజ్ కమిషనర్ నీతూప్రసాద్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక కమిషన్ సభ్యులు చెన్నయ్య, మెంబర్ సెక్రటరీ సురేష్ చందా తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...జడ్పీపీ చైర్‌పర్సన్ల సమావేశంలో మాట్లాడుతున్న రాజేశం గౌడ్