రాష్ట్రీయం

జిల్లాలకు వస్తున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: మున్సిపల్ ఎన్నికల తర్వాత జిల్లాల పర్యటనకు రానున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ ముఖ్యనేతలకు వెల్లడించారు. ఆ సందర్భంగా ఇటీవల వివాదంగా మారిన పోడు భూముల సమస్యను పరిష్కరించనున్నట్టు కూడా సీఎం చెప్పారు. పార్టీ ముఖ్యనేతలతో తెలంగాణ భవన్‌లో బుధవారం సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆరా తీశారు. అన్ని జిల్లాల్లో నిర్మించనున్న పార్టీ కార్యాలయాల నమూనాలను, వాటికయ్యే రూ. 60 లక్షలకు సంబంధించిన చెక్కులను జిల్లాల బాధ్యులకు ముఖ్యమంత్రి అందజేశారు. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం దసరా వరకు పూర్తి చేసి పండుగ రోజున ప్రారంభోత్సవాలు జరగాలని ఆదేశించారు. అలాగే, సభ్యత్వ నమోదును త్వరగా ముగించి, మున్సిపల్ ఎన్నికలపై దృష్టిసారించాల్సిందిగా పార్టీ నేతలకు సూచించారు. అసెంబ్లీ, పంచాయతీ, పరిషత్ ఎన్నికల మాదిరిగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించాలని సీఎం కేసీఆర్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. వరుస ఎన్నికల కారణంగా జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ తన జిల్లా పర్యటన సందర్భంగా పరిష్కరించనున్నట్టు హామీ ఇచ్చారు. ఆలోగా జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నికల హామీలపై తనకు నివేదికలు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే అధికారులను ఆదేశించానని, వీటిపై విధిగా మీరు కూడా నివేదికలు తయారు చేయాలని పార్టీ నేతలను సీఎం ఆదేశించారు. ముఖ్యంగా పోడు భూముల సమస్యను ఎదుర్కొంటున్న ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో తన పర్యటన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలతో ముఖాముఖి చర్చించి పరిష్కరించనున్నట్టు వివరించారు. వరుస ఎన్నికల కారణంగా ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నింటినీ తన పర్యటనల సందర్భంగా పరిష్కరించనున్నట్టు చెప్పారు.

చిత్రం...తెలంగాణ భవన్‌లో బుధవారం పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్