రాష్ట్రీయం

సీట్లపై రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 17: శాసనసభలో నిబంధనల ప్రకారమే సీట్ల కేటాయింపు జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ప్రశ్నోత్తరాల ఆరంభంలోనే సీటింగ్‌పై రగడ ప్రారంభమయింది. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ ఎవరు ఎన్నిసార్లు గెలిచివచ్చినా... ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే అంటూ పుస్తకంలోని సంబంధిత అంశాలను చదివి వినిపించారు. గడిచిన ఐదేళ్ళలో చంద్రబాబు ప్రతిపక్షానికి కనీసం మాట్లాడేందుకు సమయం కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. అయితే తాము మొదటి రోజు నుంచి తగిన ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గతంలో ఏం జరిగిందో గుండెలపై చేయి వేసుకుని చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు తూటాల్లా పేలాయి. ఓ దశలో అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ సభ్యులు స్పీకర్ తమ్మినేని సీతారాం హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ నిలబడి నినాదాలు చేస్తున్న నేపథ్యంలో ఏ క్షణంలో అయినా సస్పెండ్ కానున్నారా అనే అనుమానం కూడా వ్యక్తమైంది. అయితే స్పీకర్ ఎంతో ఓర్పుగా ఉభయులను శాంతింప
చేస్త్తూనే మొత్తం 10 ప్రశ్నలకు గాను మూడు ప్రశ్నంతోనే సరిపెట్టి ప్రశ్నోత్తరాలను వాయిదా వేశారు. నీటి పారుదల ప్రాజెక్టులపై వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ‘పోలవరంతో పాటు 238 ప్రాజెక్టులకు కూడా అంచనాలను పెంచుకుంటూ పోయి ప్రజాసొమ్ము దోపిడీ చేసారంటూ’ ఆరోపించారు. దీనికి సమాధానమివ్వటానికి తమకు అనుమతివ్వాలంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీఎల్పీ ఉపనేతలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి తదితరులు స్పీకర్‌పై పదేపదే ఒత్తిడి తెచ్చారు. నిబంధనల మేర ప్రశ్న వేసిన వారికే మాట్లాడే అవకాశం ఉందంటూ... ఇతర సభ్యులచే మాట్లాడిచ్చే అధికారం స్పీకర్‌కే ఉందన్నారు. అయితే అనవసర రభసతో సమయాన్ని వృథా చేసినందున మరో ప్రశ్నలోకి వెళ్లిపోయామని, అందువల్ల మాట్లాడే అవకాశం లేదని స్పీకర్ స్పష్టం చేశారు. దీనిపై టీడీపీ సభ్యులందరూ లేచి నిలబడి వియ్ వాంట్ జస్టిస్... ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి అంటూ నినదిస్తుండగా... అధికార పక్ష సభ్యులంతా మూకుమ్మడిగా లేచి చంద్రబాబు డౌన్ డౌన్... ఖబడ్డార్... తెలుగు దొంగల పార్టీ... అంటూ పెద్దపెట్టున నినాదాలివ్వడం ప్రారంభించారు. అధికారపక్ష సభ్యులు కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి ముందు వరుసలో చంద్రబాబు పక్క సీటులో కూర్చొని నినాదాలిస్తుండటాన్ని గమనించిన స్పీకర్ సీతారాం ఆయనకు కేటాయించిన వెనుక సీట్లో కూర్చోవాలంటూ రూలింగ్ ఇచ్చారు. శ్రీ్ధర్‌రెడ్డి వెంటనే తన సీట్లోకి వెళ్ళిపోయి అక్కడే నిలబడి... బాబు పక్కన కూర్చొన్న అచ్చెన్నాయుడి సంగతేమిటని ప్రశ్నించారు. స్పీకర్ దీనికి స్పందిస్తూ అచ్చెన్నాయుడి వెనక్కి వెళ్లి బుచ్చయ్యచౌదరి ముందుకు రావాలంటూ ఆదేశించారు. ఎంతసేపటికి కూడా అచ్చెన్నాయుడు కదలకపోవటంతో స్పీకర్ ఆగ్రహించారు. సీనియార్టీ, ఆపై అక్షర క్రమంలో సీట్లు కేటాయించామని స్పీకర్ తెలిపారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ అచ్చెయ్య, బుచ్చెయ్య అనగా టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. దీనిలో తప్పులేదని పల్లెల్లో గౌరవంగా పిలుస్తుంటారని అన్నారు. దీనిపై అధికారపక్ష సభ్యుడు అంబటి రాంబాబు స్పందిస్తూ చంద్రబాబు సానుభూతి డ్రామాలు ఆడుతున్నారని, ప్రజల్లో సానుభూతి కోసం ఏదేదో మాట్లాడుతున్నారని, అయితే బెదిరిస్తే బెదిరిపోయే వారు ఇక్కడ ఎవరూ లేరన్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ ఆరుసార్లు సభ్యుడైనా, ఒక్కసారి ఓడి మరొకసారి గెల్చినా, ఒకేసారి గెల్చినా, ప్రతిఒక్కరూ రూల్స్ బుక్ ఫాలో కావాలన్నారు. గతంలో ఎన్టీఆర్, వైఎస్‌లు సీఎంలుగా ఉన్నప్పుడు ఏం జరిగిందో వివరించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ సంఖ్యాబలం ఉందని తరుచూ తనను బెదిరించాలని చూస్తే భయపడేది లేదన్నారు. ఏదో విధంగా నిత్యం తనను అవమానపర్చేలా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తప్పని పరిస్థితుల్లో అచ్చెన్నాయుడు వెనక్కి పోగా, బుచ్చయ్య చౌదరి బాబు పక్కన కూర్చోవటంతో సభ సద్దుమణిగింది.
చిత్రం...నిబంధనలు చూపిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి