రాష్ట్రీయం

బడ్జెట్.. ఓ హైడ్రామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 17: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హై డ్రామాలాడుతోందని టీడీపీ ఆరోపించింది. బడ్జెట్‌పై చర్చ ముగింపు సందర్భంగా బుధవారం సభలో టీడీపీ తరపున ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ అంకెలు తప్ప అందులో ఏమీ అర్థం కావటం లేదని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతికి రూ. 500 కోట్లు కేటాయించి పులివెందులకు రూ. 100 కోట్లు పెట్టుకున్నారని విమర్శించారు. ఇక ఏ రకంగా రాజధాని అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ఫిస్కల్ లోటు 3.58 శాతంగా ఉంటే ఆర్థికాభివృద్ధి ఎలా సాధ్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్‌తో పాటు వ్యవసాయ రంగానికి తక్కువ కేటాయింపులు జరిపారని ఆక్షేపించారు. దేశం మొత్తంగా పర్యాటక రంగానికి రూ. 16 లక్షల కోట్లకు పైగా ఆదాయం వస్తోందని అలాంటి రంగానికి కేవలం రూ. 704 కోట్లు మాత్రమే ప్రతిపాదించటం వల్ల పర్యాటక రంగం కుంటుపడుతుందని, తద్వారా ఉపాధి కల్పన నిలిచిపోతుందన్నారు. వైకాపా మేనిఫెస్టోలో మొత్తం 225 అంశాలు ఉన్నాయని మరో 67 కొత్త హామీలను కలుపుకుని 292 వాగ్దానాలు నెరవేర్చే విషయం బడ్జెట్‌లో ప్రస్తావనకు రాకపోవటం విడ్డూరమన్నారు. అదేవిధంగా 139 బీసీ కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తామనే ప్రకటనపై కూడా బడ్జెట్‌లో ప్రతిపాదించలేదని, దీన్నిబట్టి బీసీలు, ఎస్సీ, ఎస్టీల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అర్థమవుతోందని విమర్శించారు. కీలక రంగాలకు ప్రాధాన్యత తగ్గించారన్నారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా బడ్జెట్‌కు రూపకల్పన చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. యువతకు ఉపాధి అంశాల ఊసే లేదన్నారు. పరిశ్రమలకు కేటాయింపులు గణనీయంగా తగ్గించారని, ఐటీ రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా బడ్జెట్ ఉందన్నారు.