రాష్ట్రీయం

పీపీఏలపై తప్పుడు ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 17: సోలార్, పవన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందా (పీపీఏ)లపై రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షత నేత చంద్రబాబు నాయుడు ఆక్షేపించారు. అధికారులు జగన్‌కు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ మండిపడ్డారు. విద్యుత్ పీపీఏలపై అసెంబ్లీలో జరిగిన చర్చ సమయంలో తమ నోరు నొక్కే ప్రయత్నం చేశారన్నారు. నిజాలు ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని వివరించారు. బుధవారం మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పలు విషయాలపై మాట్లాడారు. పీపీఏలపై జగన్ ప్రభుత్వానికి సరైన అవగాహన లేదన్నారు. సాంప్రదాయేతర విద్యుత్ వినియోగం, కొనుగోళ్లకు సంబంధించి కేంద్రప్రభుత్వానికి రాష్ట్రం తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు. తాము ఏనాడూ పవన విద్యుత్‌ను యూనిట్‌కు 6.99 రూపాయలకు కొనుగోలు చేయలేదని స్పష్టంచేశారు. పవన విద్యుత్ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం పదే పదే తమిళనాడు రాష్ట్రాన్ని ఉదాహరణగా చూపిస్తుందని, అక్కడి పరిస్థితులకు మన రాష్ట్రంలోని పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. పవన విద్యుత్ తయారీకి తమిళనాడులో అనుకూలత (విండ్ వెలాసిటి) ఎక్కువగా ఉంటుందని, ఈ కారణంగా తమిళనాడులో యూనిట్ ధర మిగిలిన రాష్ట్రాల కంటే తక్కువగా ఉంటుందని తెలిపారు. మన రాష్ట్రంలో పవన విద్యుత్ తయారీకి అనుకూలతలు తక్కువని, దీంతో ధర కొంచెం అధికంగానే ఉంటుందని వివరించారు. పీపీఏ సమీక్షలపై సాక్షాత్తు కేంద్రమంత్రి చెప్పినా రాష్ట్రప్రభుత్వానికి అర్థం కావడం లేదన్నారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. జూలై ప్రారంభంలో కూడా పవన విద్యుత్ యూనిట్‌కు 4.90 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిందన్నారు. దక్షిణాది రాష్ట్రాల కన్నా ఏపీ ప్రభుత్వం అధిక ధరలు వెచ్చించి విద్యుత్‌ను కొనుగోలు చేసిందని, దీనికి ఏం సమాధానం చెప్తారంటూ నిలదీశారు. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు తాను కృషిచేశానని, ఇందులో భాగంగానే ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు ధరలు తగ్గుతూ వస్తున్నాయని తెలిపారు. జీఎంఆర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, తద్వారా అక్కడి ప్రభుత్వానికి లాభం చేకూర్చాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణపై ఉన్న ప్రేమ ఇక్కడి అధికారులకు మన రాష్ట్రంపై లేదన్నారు. నేరుగా మీడియా సమావేశాలు పెట్టి గత ప్రభుత్వాలపై తప్పుడు ఆరోపణలు చేయడం అధికారులకు తగదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు గడవకముందే రాష్ట్రంలో 22 వేల మిలియన్ యూనిట్లు విద్యుత్ లోటు ఏర్పడిందని, దీంతో రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేశారని ఆరోపించారు. పీపీఏలను సమీక్ష చేస్తానని అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పి ఐదేళ్లలో ఏమీ చేయలేక పోయారని, ప్రస్తుతం జగన్ కూడా అదే బాటలో పయనిస్తారన్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వంపై బురదజల్లడం మంచి పద్ధతి కాదని చంద్రబాబు హితవుపలికారు.
జ్యుడిషియల్ కమిషన్ సాధ్యం కాదు
టెండర్లపై ప్రస్తుత ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్తోందని, అది కుదిరేపని కాదని స్పష్టంచేశారు. ప్రభుత్వం అవగాహన లేకుండా సిట్టింగ్ జడ్జితో టెండర్లపై కమిషన్ అంటోందని ఇది జగన్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. విలేఖర్ల సమావేశంలో ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు