రాష్ట్రీయం

జెఇఇ పరీక్షకు నకిలీ హాల్‌టిక్కెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: ఐఐటికి శిక్షణ ఇచ్చే ‘్ఫట్జీ’ సంస్థ సిబ్బంది చేసిన పొరపాటుతో ఒక విద్యార్థిని ఐఐటి జెఇఇ పరీక్షలకు హాజరుకాలేకపోయింది. పొరపాటును సరిదిద్దుకునే క్రమంలో ఫిట్జీ నకిలీ హాల్‌టిక్కెట్‌ను తయారుచేసి విద్యార్థినికి అందించింది. దాంతో పరీక్షలకు హాజరైన విద్యార్థిని తన నెంబర్‌కు, పరీక్షలో అభ్యర్థి నెంబర్‌కు పొంతన లేకపోవడంతో వివాదం గాలివానగా మారింది. లక్షలాది రూపాయలు చెల్లించి రెండేళ్లపాటు శిక్షణ పొందిన విద్యార్థిని తల్లిదండ్రులు యాజమాన్యాన్ని నిలదీయడంతో స్థానికంగా కూకట్‌పల్లి బ్రాంచి నిర్వాహకుడు బాధ్యత వహిస్తూ ఆమె చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు సిద్ధపడి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. అయితే ఢిల్లీలో ఉన్న ఫిట్జీ యాజమాన్యం మాత్రం ఎదురుతిరిగి తమకు సంబంధం లేదని పేర్కొనడంతో కూకట్‌పల్లి బ్రాంచి ప్రిన్సిపాల్ నాగరవి ఇరకాటంలో పడ్డారు. విద్యార్థికి ఏడాది పాటు విద్యాసంవత్సరం నష్టపోవడంతో పాటు జెఇఇ రాసేందుకు ఉన్న అవకాశాన్ని కోల్పోవడంతో ఆమె చెల్లించిన ఫీజుకు రెట్టింపు మొత్తాన్ని చెల్లిస్తామని అంగీకరించిన స్థానిక యాజమాన్యం తీరా ఆ సమయం వచ్చేసరికి తమకు సంబంధం లేదని పేర్కొంది. ఈ క్రమంలో తల్లిదండ్రులకు, యాజమాన్యానికి మధ్య పెద్ద గొడవ జరగడంతో ముందుగా తాము ఇచ్చిన హామీ మేరకు అంత మొత్తాన్ని చెల్లించలేమని, కొంత మేరకు సొంత డబ్బు చెల్లిస్తానని ప్రిన్సిపాల్ ఒప్పందానికి వచ్చినట్టు తెలిసింది. ఈ మొత్తం వివాదంపై ఫిట్జీ డైరెక్టర్ ఆర్‌కె గోయల్‌ను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని బదులిచ్చారు.