రాష్ట్రీయం

గోరా శాస్ర్తీ శతజయంతి సదస్సు రేపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : గోరాశాస్ర్తీ శతజయంతి సదస్సును ఈ నెల 20వ తేదీన హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు నిర్వహిస్తున్నట్టు పాత్రికేయ సంఘం అధ్యక్షుడు జీఎస్ వరదాచారి తెలిపారు. సాహిత్య అకాడమి సహకారంతో నిర్వహిస్తున్న ఈ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారు. సాహిత్య అకాడమి కార్యదర్శి కే శ్రీనివాసరావు స్వాగతం పలుకుతారు. ఈ సందర్భంగా వినాయకుడి వీణ గ్రంథావిష్కరణ ఉంటుందని.. ఈ కార్యక్రమానికి సాహిత్య అకాడమి తెలుగు సలహా మండలి సంచాలకుడు కే శివారెడ్డి అధ్యక్షత వహిస్తారని చెప్పారు.
మధ్యాహ్నం జరిగే మొదటి సమావేశానికి బండారు శ్రీనివాసరావు అధ్యక్షత వహిస్తారు. అందులో గోరాశాస్ర్తీ ఆంగ్ల సంపాదకీయాలపై దాసు కేశవరావు, తెలుగు సంపాదకీయాలపై కల్లూరి భాస్కరం, కథలపై కేబీ లక్ష్మీ, నాటకాలపై నాగసూరి వేణుగోపాల్ పత్రాలు సమర్పిస్తారు. ‘నాకు తెలిసిన గోరాశాస్ర్తీ’ అంశంపై నందిరాజు రాధాకృష్ణ పత్రాన్ని సమర్పిస్తారని చెప్పారు. రెండో సమావేశం మధ్యాహ్నం 2.30కు జరుగుతుందని దానికి పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్ అధ్యక్షత వహిస్తారు. గోరాశాస్ర్తీ శ్రావ్య నాటకాలపై పీఎస్ గోపాలకృష్ణ, గోరాశాస్ర్తీ సాహితీ వ్యక్తిత్వంపై గోవిందరాజు చక్రధర్, స్వతంత్ర సంపాదకుడు గోరాశాస్ర్తీ జ్ఞాపకాలు అంశంపై కే రామలక్ష్మి, గోరాశాస్ర్తియం ఒక పరిశీలన అంశంపై శ్రీనివాస్ వాసుదేవ పత్రాలు సమర్పిస్తారని చెప్పారు. ఎస్ రాధాకృష్ణ వందన సమర్పణ చేస్తారని పేర్కొన్నారు.