రాష్ట్రీయం

నాలుగు బిల్లులకు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ గురువారం నాలుగు బిల్లులను ఆమోదించింది. మెడికల్ కాలేజీల్లో బోధనా సిబ్బంది వయోఃపరిమితి హెచ్చింపు బిల్లు, కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య నిర్దారించే చేసే బిల్లు, ఎంపీపీ, జడ్పీపీ పాలక వర్గాలను ముందుగానే ఎన్నుకునేందుకు సంబంధించిన బిల్లు, రుణమాఫీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లులను సభ ఆమోదించింది.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో బోధనా సిబ్బంది వయోఃపరిమితిని 58 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెంచుతూ జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో కొత్త బిల్లును సభ ఆమోదించింది. చిన్న సన్నకారు రైతులు, కార్మికులు, వృత్తిపనివాళ్లకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసే రుణమాఫీ రాష్ట్ర కమిటీకి హైకోర్టు రిటైర్డ్ జడ్జిని చైర్మన్‌గా నియమించాలంటూ కేంద్రం చట్టం చేసింది. కేంద్రం తీసుకువచ్చిన చట్టంలో శాసనసభ మార్పులు చేస్తూ ప్రతిపాదించిన బిల్లును సభ ఆమోదించింది. వ్యవసాయ రంగం లేదా న్యాయ రంగం లేదా ఆర్థిక రంగంలో నైపుణ్యం కలిగిన వారిని ఈ కమిటీ చైర్మన్‌గా నియమించేందుకు ఈ బిల్లు వల్ల వీలు కలుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లలో వార్డుల సంఖ్యను నిర్దారిస్తూ రూపొందించిన బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం జడ్పీపీ, ఎంపీపీ పాలక వర్గాల పదవీ కాలం పూర్తయిన తర్వాత కొత్తగా మళ్లీ పాలక వర్గాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే ఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీపీల ఎన్నికల విషయంలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తడంతో, ఒకవైపు పాలక వర్గాలు ఉన్నప్పటికీ, మరోవైపు కొత్త పాలక మండళ్లను ఎన్నుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది.