రాష్ట్రీయం

అమరావతిలో ఆర్మీ సబ్ ఏరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 18: ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యంతో గురువారం ఆంధ్ర, తెలంగాణ సబ్ ఏరియా మేజర్ జనరల్ ఎస్ శ్రీనివాసరావు భేటీ అయ్యారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల విభజన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్ర సబ్ ఏరియాను విభజించి ఏపీకి ప్రత్యేక సబ్ ఏరియా ఏర్పాటు చేయాల్సి ఉందని ఇందుకు గతంలో రక్షణశాఖ ప్రతిపాదించిన ప్రకారం అవసరమైన భూమిని సమకూర్చాలని సీఎస్‌ను కోరారు. రాజధాని ప్రాంతంలో అనువైన భూమిని ప్రభుత్వ ధరలకు అనుగుణంగా రక్షణ శాఖకు అప్పగిస్తే త్వరితగతిన ఆంధ్ర సబ్ ఏరియాను ఏర్పాటు చేసేందుకు వీలు కలుగుతుందని శ్రీనివాసరావు వివరించారు. కృష్ణాజిల్లాలో సుమారు 12 వేల మంది వరకు మాజీ సైనికోద్యోగులు ఉన్నారని చెప్తూ వారికి కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ కింద వైద్య సదుపాయం కల్పిస్తున్నట్లు సీఎస్‌కు తెలిపారు. రక్షణ శాఖకు సంబంధించి ప్రభుత్వం నుంచి అవసరమైన తోడ్పాటు తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ భేటీలో కల్నల్ కార్తికేయ, కమాండర్ బీవీఎస్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను కలిసిన ఆర్మీ అధికారులు