రాష్ట్రీయం

నాపై బురద జల్లొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జూలై 19: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) ఎటువంటి అవకతవకలు జరగలేదని, తప్పుడు సమాచారంతో అధికారులు తప్పదారి పట్టిసున్నారని, అసత్య ప్రచారాలు చేస్తున్న వైసీపీ నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షనేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏడోరోజు శుక్రవారం పీపీఏలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని గట్టెక్కించేందుకు అప్పట్లోనే టీడీపీ ప్రభుత్వం విద్యుత్ రంగంలో ఎనలేని సంస్కరణలు తీసుకు వచ్చినందునే నేడు మిగులు విద్యుత్ స్థాయికి చేరుకున్నామన్నారు. కర్ణాటకలో విద్యుత్ వ్యాపారం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వాస్తవాలు తెలిసి కూడా తాను ఎక్కువ ధర తీసుకుంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
డెవలపర్‌గా జగన్‌కు డబ్బులు కావాలో, సీఎంగా అభివృద్ధి కావాలో చెప్పాలన్నారు. వైఎస్ హయాంలో కూడా పీపీఏలపై కమిటీలు వేసి చివరకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి గుర్తు పెట్టుకోవాలన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఏ రాష్ట్రానికి రాని విధంగా విద్యుత్ రంగంలో 137 అవార్డులు వచ్చాయన్నారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఆరోపణలు చేసి, విద్యుత్‌శాఖను సంక్షోభంలోకి నెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.
పీపీఏలను సమీక్షించేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ అత్యుత్సాహంతో తప్పుడు సమాచారాన్ని ఇస్తోందన్నారు. ఇటీవల ప్రభుత్వ సలహాదారు అజయ కల్లం, విద్యుత్ అధికారులతో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో చెప్పిన అంశాలు అన్నీ అబద్ధాలేనన్నారు. వేల కోట్ల రూపాయల నష్టం అంటూ చేస్తున్న ప్రకటనలో వాస్తవం లేదన్నారు. రెన్యువబుల్ ఎనర్జీకి సంబంధించి పారిస్‌లో జరిగిన సదస్సులో అప్పటి ప్రధానితో పాటు తాను కూడా పాల్గొన్నానన్నారు. అప్పటి ప్రధాని సూచనలతో రాష్ట్రంలో కూడా రెన్యువబుల్ విద్యుత్ కోసం ప్రణాళికలు తయారు చేశామన్నారు. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో సౌర, పవన విద్యుత్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో ధరలకు కూడా తగ్గుతాయని, దీని కారణంగానే సౌర, పవన్ విద్యుత్ ధరలు తగ్గుతూ వస్తున్నాయన్నారు.
విద్యుత్ ఖర్చులు తగ్గిస్తూ, రాష్ట్ర ప్రజలపై భారం పడకుండా గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో మార్పులు చేశామన్నారు. అందుకే ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలను పెంచలేదన్నారు. పీపీఏలకు సంబంధించి పవన విద్యుత్‌లో ఒక్కో యూనిట్‌కు రూ.4.84 పైసలు కాగా, ఫిక్సిడ్ రేట్ రూ.1.10లు కలిపి మొత్తం రూ.5.94గా ఉంటుందన్నారు. దీనిలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారం రూ.1.75 ప్రోత్సహకంగా తిరిగి వస్తుందన్నారు. దూరదృష్టి, అవగాహన లేకుండా తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కేంద్రప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారం ప్రతీ ఏటా కొనుగోలు చేసినట్లు తెలిపారు. 2030 నాటికి 30 శాతం కొనుగోలుగా కేంద్రం నిర్ణయించిన విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఆర్‌పీఓ నిర్దేశించిన దాని ప్రకారం మాత్రమే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయన్నారు. కర్నాటకలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టుకు మాత్రం జగన్ అధిక ధర వసూలు చేస్తున్నారని తెలిపారు. పవన విద్యుత్‌కు సంబంధించి యూనిట్‌కు రూ.4.50పైసలు కేంద్రం అందిస్తున్న రూ.0.50 పొందుతున్నారని తెలిపారు. యూనిట్ ధరను పెంచేందుకు కర్నాటక రెగ్యురేటరీకి లేఖలు రాసి మరీ ధరను పెంచుకుని అమ్ముకుంటున్నారని తెలిపారు. ఒకపక్క డెవలపర్‌గా డబ్బులు తీసుకుంటున్న జగన్, రాష్ట్రానికి అందించేందుకు మాత్రం ముందుకు రావడం లేదన్నారు. తన దగ్గర తప్పు పెట్టుకుని దాని కప్పి పుచ్చుకునే క్రమంలో ఎదుటి వారిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పవన, సౌర విద్యుత్‌లో ధరల్లో ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుతో రాష్ట్రానికి అప్రతిష్ట వస్తుందన్నారు. దీని కారణంగానే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కూడా ఆగిపోతున్నాయన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి అన్నింటిలో ఉన్న మంచి గుర్తింపు పోయే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయన్నారు. తప్పులు జరగకపోయినా పదే పదే చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారే తప్పా మరోకటి లేదన్నారు. పీపీఏల్లో ఎటువంటి తప్పులు జరగలేదు, ఒక్క చిన్న తప్పు కూడా తాను చేయలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే తాను కష్టపడి పని చేశానన్నారు. 1999లో తాను తీసుకు వచ్చిన సంస్కరణల ప్రభావంతోనే రాష్ట్రంలో మిగులు విద్యుత్‌కు చేరుకున్నామన్నారు. అందుకే కేంద్రం నుండి 137 అవార్డులను గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందుకుందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారమే పీపీఏలు జరిగాయని ఇందుకు సంబంధించిన జీవోలను కాస్త చదువుకుని అవగాహన చేసుకోవాలన్నారు. వాటిని మీ ద్వారా సీఎం జగన్‌కు పంపుతున్నట్లు జీవో కాపీలను స్పీకర్‌కు అందజేశారు.