రాష్ట్రీయం

జాబిల్లి యాత్రకు ఇస్రో ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూలై 19: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అలుపెరగని పోరాటంతో మళ్లీ చంద్రయాన్-2 పునఃప్రయోగానికి సన్నద్ధమైంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 22న సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్-2 ప్రయోగం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభించనున్నారు. జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3-ఎం 1 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 మిషన్‌లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ అనే మూడు పరికరాలను చంద్రుని మీద పరిశోధనకు ఇస్రో పంపుతోంది. ఈ ప్రయోగ సన్నాహాల్లో భాగంగా శుక్రవారం కూడా రాకెట్‌లోని అన్ని వ్యవస్థల పనితీరును పరిశీలించారు. అనంతరం రిహార్సల్‌ను కూడా విజయవంతంగా నిర్వహించారు. ప్రయోగం నేపథ్యంలో శనివారం డాక్టర్ బిఎన్ సురేష్ అధ్యక్షతన మళ్లీ మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్‌ఆర్) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో శాస్తవ్రేత్తలందరూ పాల్గొని ప్రయోగంపై చర్చించనున్నారు. ఎంఆర్‌ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) వారు సమావేశమై రాకెట్ పనితీరు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని అన్నీ బాగుంటే ప్రయోగానికి సంసిద్ధత ఇవ్వనునున్నారు. శనివారం కూడా మళ్లీ రిహార్సల్‌తోపాటు ప్రీ కౌంట్‌డౌన్‌ను కూడా నిర్వహించనున్నట్లు తెలిసింది. అన్ని సజావుగా సాగితే ఇస్రో నిర్దేశించిన సమయానికే ఈ నెల 22న మధ్యాహ్నం 2.43 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్-2 మిషన్ జాబిల్లి చెంతకు పయనమవుతోంది.
నాలుగు రోజుల్లోనే సాంకేతిక లోపాన్ని సరిచేసి...
ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రయోగం. ప్రపంచ దేశాలన్ని షార్ వైపే చూస్తున్నాయి. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ సైతం విచ్చేసి ఉన్నారు. ఆదివారం ఉదయం నిర్దేశించిన సమయానికే కౌంట్‌డౌన్ సైతం ప్రారంభమైంది. దేశమంతా మేల్కొని ప్రయోగాన్ని చూసేందుకు కళ్లు ఆర్పకుండా కొందరు నింగివైపు, మరికొందరు టీవీలు చూస్తున్నారు. మరికొద్ది సమయంలోనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్-2 నింగిలోకి దూసుకెళ్లేది.. కాని అనుకోని కారణంతో రాకెట్ క్రయోజనిక్ దశలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగం అనూహ్యంగా వాయిదా పడింది. అందరితో పాటు ఇస్రో శాస్తవ్రేత్తలు కూడా నిరాశ చెందారు. ఇక రెండు, మూడు నెలల సమయం పడుతుందని అందరూ భావించారు. కాని శాస్తవ్రేత్తలు వెంటనే తేరుకొని లోపాన్ని పెద్ద సవాల్‌గా తీసుకొని పూర్తిస్థాయిలో అనే్వషణ మొదలుపెట్టారు. నిద్రాహారాలు మాని అలుపెరగని పోరాటంతో సాంకేతిక లోపాన్ని సరిచేసే దానిపైనే దృష్టిసారించారు. నెలలు జరిగే పనిని కేవలం రోజుల వ్యవధిలోనే లోపాన్ని సరిచేసి ప్రయోగానికి సిద్ధం చేశారు. శాస్తవ్రేత్తల రెట్టింపు ఉత్సాహంతో వాయిదా పడిన చంద్రయాన్-2 ప్రయోగాన్ని మరో వారం వ్యవధిలోనే చంద్రయాన్-2 మిషన్ పునఃప్రయోగానికి సన్నద్ధమవడం విశేషం