రాష్ట్రీయం

మున్సి‘పోల్స్’లో మాదే హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హవా కొనసాగుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శాసన సభా పక్షం కార్యాలయంలో శుక్రవారం మీడియాతో కేటీఆర్ పిచ్చాపాటిగా మాట్లాడుతూ, ‘నలుగురు ఎంపీలను గెలవగానే ఆగడం లేదు. ఎనిమిది జడ్‌పీటీసీలే గెలిచిన విషయాన్ని వాళ్లు మరిచిపోతున్నారు’ అని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘వీళ్ల పరిస్థితి ఇలా ఉంటే, కాంగ్రెస్‌కేమో అక్కడ ఐఏసీసీకి అధ్యక్షుడు లేడు, ఇక్కడ పీసీసీకి కూడా లేరు. కాంగ్రెస్సే సంక్షోభంలో పడింది. ఎవరేమిటో మున్ముందు తేలుతుంది’ అని కేటీఆర్ అన్నారు. ‘మున్సిపల్ ఎన్నికల్లో అగ్రభాగాన ఉండేది టీఆర్‌ఎస్సే. రెండో స్థానం ఎవరిదో ఆ రెండు పార్టీలే తేల్చుకోవాలి’ బీజేపీ, కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలదేనన్నారు. పార్టీ సభ్యత్వం ముమ్మరంగా జరుగుతున్నదని, ఇప్పటికే
35 లక్షలు దాటిందన్నారు. గతంలో ఇది 46 లక్షలు ఉండేదన్నారు. కర్నాటక రాజకీయాల గురించికానీ, ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న చర్చల పట్లకానీ తమకు ఆసక్తి లేదన్నారు. గవర్నర్‌ను మార్చుతారన్న సమాచారం తమకు లేదన్నారు. అయినా గవర్నర్ వ్యవస్థలో ఏదో తలదూర్చి ఏదో చేయాలని అనుకోవడం లేదన్నారు. ఏ వ్యవస్థ అయినా దాని పరిధిలో అది పని చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేటీఆర్ స్పష్టం చేశారు. కొత్త మున్సిపల్ చట్టం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది తప్ప భారం పడదన్నారు. దీని వల్ల వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కచ్చితంగా లాభం కలుగుతుందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలనా వికేంద్రీకరణ జరిగి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆ మేలు ఏమిటో సిరిసిల్ల రాజన్న జిల్లాలో తాను ప్రత్యక్షంగా చూస్తున్నానని కేటీఆర్ వివరించారు. మున్సిపాలిటీలపై పర్యవేక్షణను కలక్టర్లకు అప్పగించడం వల్ల వారిపై భారం పడుతుందని అనుకోవడం లేదన్నారు. ఒక్కో జిల్లాలో మూడు, నాలుగు మున్సిపాలిటీలే ఉన్నాయన్నారు. సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాల అంశం కోర్టులో ఉండటంతో తానేమి వ్యాఖ్యానించనన్నారు. కోర్టు ఏం చెబుతుందో చూద్దాం అన్నారు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం కోర్టులో ఉంది
ఎమ్మెల్యేలు, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం సుప్రీంకోర్టులో ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. అయినప్పటికీ ఈ అంశానికి వారం రోజుల్లో పరిష్కారం కనుక్కోవాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు. ఈ అంశాన్ని శుక్రవారం కొందరు ఎమ్మెల్యేలు సీఎంను కలిసి కోరగా, దీనిపై పరిష్కారం కనుక్కోవాలని సీఎంఓ అధికారులను ఆదేశించారన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించే బాధ్యత నాదేనన్నారు. ఈ అంశంపై త్వరలో జర్నలిస్టుల ప్రతినిధులతో భేటీ అవుతానని కేటీఆర్ హామీ ఇచ్చారు.