రాష్ట్రీయం

ప్రజల కోసం దేనికైనా తెగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: వచ్చే మూడేళ్లలో తెలంగాణలో అద్భుతాలు జరుగుతాయని, ఆగస్టు 15వ తేదీ నుంచి పూర్తి స్థాయి ప్రజలకు ఉపయోగపడే సంస్కరణలతో బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు 128, నగర పాలక సంస్థలు 13 ఉంటాయన్నారు. ఇక నగర పంచాయతీ వ్యవస్థ ఉండదన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం దేనికైనా తెగిస్తామన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన కొత్త మున్సిపల్ చట్టంపై మాట్లాడుతూ, ఆగస్టు 15వ తేదీ తర్వాత మా ప్రభుత్వం అంటే ఏమిటో చేసి చూపిస్తాం అన్నారు. గత ఆరు నెలలుగా కోడ్ ప్రభావం ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ఎన్‌ఐఆర్‌డీ ఏర్పాటుకు ఎస్‌కే డే అనే మహాశయుడుకారణమని, పంచాయతీరాజ్, స్థానిక సంస్థల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని ఆయన అన్నారు. కేంద్రం నుంచి పంచాయతీలకు రూ.1030 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.1600 కోట్ల గ్రాంటు వస్తుందన్నారు. దీనికి మ్యాచింగ్ నిధులు జతచేసి అభివృద్ధి చేస్తామన్నారు. సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియన్నారు. మంచి ప్రగతి చూపించిన పంచాయతీలకు రూ.5 లక్షల నుంచి ఇంకా పెద్ద మొత్తం వరకు పారితోషికం ఉంటుందన్నారు. నిధుల లేమి లేదని ఆయన స్పష్టం చేశారు. మార్పులు నిరంతరమని, కాని ఎన్‌ఫోర్స్‌మెంట్ అవసరమన్నారు. నిజాంపేట లాంటి గ్రామంలో ఎడాపెడా భవనాలు నిర్మించడం వల్ల టౌన్ ప్లానింగ్ అస్తవ్యస్తమైందన్నారు. పంచాయతీలు, ఎంపీపీలు, జడ్పీపీలకు ఉపాధి హామీ కింద రూ.3వేల కోట్ల నిధులు ఇచ్చి పనులు చేయించే అధికారాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ను రెండు జిల్లాలుగా చేయాలని తన అభిమతంగా ఉండేదన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌గా ఏర్పాటు చేయాలనుకున్నామని, కాని అంతర్జాతీయంగా ఈ నగరానికి ఉన్న పేరును గుర్తు పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకోలేకపోయామన్నారు. రంగారెడ్డి,మేడ్చెల్ జిల్లాల్లోనే పది వరకు మున్సిపాలిటీలు ఉన్నాయని, మిగతా జిల్లాల్లో మూడు, నాలుగు కంటే ఎక్కువ లేవన్నారు. అందుకే కలెక్టర్లకు పర్యవేక్షణాధికారాలు ఇస్తున్నామన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది రెవెన్యూ పరిధిలోకి వస్తుందని, కాని వారు ప్రత్యేక సంఘాన్ని పెట్టుకున్నారన్నారు. అలాగే గ్రామాల్లో వీఆర్‌ఓలు తలుచుకుంటే భూమినిరాసి ఇస్తారన్నారు. వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయని, మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటామని, కాని ఆచరణలో జరిగే పనులు వేరన్నారు. ఇకపై ఇలాంటి పనులను ఉపేక్షించబోమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఏకచ్ఛత్రాధిపత్యానికి తావులేదన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా శాసనసభ ద్వారా మాత్రమే జరగాలన్నారు. ప్రభుత్వం సొంతంగా నిర్ణయం తీసుకుని అమలు చేయరాదన్నారు. హైదరాబాద్‌లో పట్టణాభివృద్ధి కోసం ప్రత్యేక ఎక్స్‌లెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామన్నారు. గతంలో సర్పంచ్‌లపై సస్పెన్షన్ వేటు పడితే ఎమ్మెల్యేలను పట్టుకుని హైదరాబాద్‌కు వచ్చి మంత్రుల ద్వారా స్టేను పొందేవారని, ఇప్పుడా పరిస్థితిలేదన్నారు. ఇకపై నిర్దేశించిన బాధ్యతలు నిర్వహించకపోతే మున్సిపల్ చైర్మన్లు, వార్డు మెంబర్లపై కూడా వేటు వేస్తామన్నారు. మంత్రులకు స్టే ఇచ్చే అధికారాలను తొలగించామన్నారు. హైదరాబాద్ శివార్లలో ఇంటిగ్రేటేడ్ టౌన్‌షిప్‌లనునిర్మిస్తామన్నారు.