రాష్ట్రీయం

గిరిజన ప్రాంతాల్లో తిరుగుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ప్రజా దర్బార్‌లను నిర్వహంచి పోడు భూముల సంగతిని తేల్చుతామని, గిరిజనుల హక్కులను పరిరక్షిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. త్వరలోనే తాను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, 75 మంది ఫారెస్టు సర్వీసు అధికారులు గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తామన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో కొత్త మున్సిపల్ బిల్లుపై మాట్లాడుతూ గొత్తి కోయలు మన రాష్ట్రంలోకి ప్రవేశించడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. పోడు భూములను గుర్తించి గిరిజనులకు అటవీ చట్టం కిందం అక్కడికక్కడే పంపిణీ చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల అధికారులతో కలిసి తాను వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రజాదర్బార్‌లో గోప్యంగా నిర్వహించబోమని, చాటుమాటు మాటలు ఉండవని, బహిరంగంగానే చర్చిస్తామన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలో 85 శాతం మొక్కలు పెంచాలన్నారు. అలా పెంచిన వారి సర్వీసులనుక్రమబద్ధీకరిస్తామన్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయని పక్షంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. సర్పంచ్‌లు కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. చెట్లు పెంచకపోతే సర్పంచ్‌లు, కార్యదర్శులు, మున్సిపల్ అధికారులు, వార్డు మెంబర్లు, కార్పోరేటర్లు ఇంటికిపోవాల్సిందేనన్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రీన్ కమిటీలను నియమిస్తామన్నారు. రాష్ట్రంలో నాలుగు వేల నర్సరీలను ప్రభుత్వం ఏర్పాటుచేసిందన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌కు
వచ్చి గండిపేట నీళ్లు తాగితే తెల్లబడేవారని, ఈ రోజు ఆ పరిస్థితి లేదన్నారు. బంజారాహిల్స్‌లో ఉండేవారికి ఫ్యాన్ అవసరం ఉండేది కాదన్నారు. అనంతగిరి, నర్సాపుర్ అడవులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అడవుల పెంపకం కోసం కఠినమైన నిబంధనలు తప్పవన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్లు, యువత, వివిధ రంగాలనిపుణుల కమిటీని ఏర్పాటు చేసి చెట్లను పెంచడంపై సమీక్షిస్తాయన్నారు. మున్సిపాలిటీల్లో జనన, మరణ ధృవపత్రాలకు సంబంధించి జరుగుతున్న జాప్యాన్ని నివారిస్తామన్నారు. వీటిని వెంటనే ఉద్యోగులు ఇవ్వకపోతే ఉద్యోగాలు పోతాయాన్నారు. అలాగే మున్సిపాలిటీల్లో పనిచేసే సిబ్బందిని రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకైన బదిలీ చేసే విధంగా అధికారాలను కొత్త చట్టం కల్పిస్తుందన్నారు. ఈ చట్టాన్ని ఎమ్మెల్యేలు మొదలుకుని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చదవాలన్నాలుర. అన్ని మున్సిపాలిటీల్లో కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం కోటి జనాభా ఉన్నా హైదరాబాద్‌లోనే ఆరేడు మార్కెట్లు కంటే ఎక్కువ లేవన్నారు. జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజాప్రతినిధులు ధర్మకర్తలుగా ఉండాలన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలు కరెంటు బిల్లులు, ఇతర పన్నులను చెల్లించడం లేదన్నారు. ఇకపై కొత్త చట్టం ప్రకారం బిల్లులను చెల్లించనిపక్షంలో కఠిన చర్యలుంటాయన్నారు. వాటర్ బిల్లులను ప్రతి నెల చెల్లించాలన్నారు.