రాష్ట్రీయం

పేదలకునజరానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుశుక్రవారం అసెంబ్లీలో పేద, మధ్యతరగతి వర్గాలకు ఇళ్ల నిర్మాణంపై వరాలు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీల పరిధిలో 75 గజాల స్థలం ఆ లోపు ఉన్న వారు మున్సిపాలిటీ అనుమతిలేకుండా జీ ప్లస్ ఒన్ భవనాన్ని నిర్మించుకోవచ్చని ప్రకటించారు. ఈ వర్గాలు ఇంటి పన్ను సాలీనా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు ఒక రూపాయిగా నిర్ణయించారు. వీరు మున్సిపల్ సదుపాయాలు పొందేందుకు పేర్లను నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. మున్సిపల్ చట్టంలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు, పర్యవేక్షణ చేసేందుకు కలెక్టర్లకు అధికారాలు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే కూల్చివేస్తామన్నారు. శుక్రవారం అసెంబ్లీలో తెలంగాణ మున్సిపల్ బిల్లు 2019ను ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ చట్టంపై పలు అంశాలపై ప్రసంగించారు. పారదర్శకత, జవాబుదారీతనాన్ని
పెంచే ఉద్దేశ్యంతో కొత్త మున్సిపల్ చట్టాన్ని తెస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజలకు మేలు చేసే విధానాలు కొత్త చట్టంలో ఉన్నాయన్నారు. ఐదు వందల చదరపుమీటర్ల స్థలంలో పది మీటర్ల ఎత్త్భువనాలను నిర్మించుకునేందుకు మున్సిపల్ కార్యాలయాల చుట్టూ అనుమతులు కోసం తిరగాల్సిన పనిలేదన్నారు. ఆన్‌లైన్‌లోనే 15 రోజుల్లో అనుమతులు వస్తాయన్నారు. నిర్ణీతకాలపరిమితి లోపల అనుమతులు రాని పక్షంలో అనుమతులు వచ్చినట్లుకానే భావించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఆస్తిపన్ను వివరాలు దాఖలు చేసే విషయంలో స్వీయ ధృవపత్రం ఇవ్వాలన్నారు. గతంలో మాదిరిగా అధికారులు ఇంటికి వచ్చి కొలతలు తీసుకెళ్లే విధానాన్ని రద్దు చేస్తున్నామన్నారు. ఒక వేళ స్వీయ ధృవపత్రాన్ని తప్పులతో ఇచ్చినట్లు రుజువైతే భారీ జరిమానా 25 రెట్లు జరిమానాను విధిస్తామన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు చేసి అవసరమైతే 25 రెట్లు జరిమానాను విధిస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను నమ్ముతామని, అందుకే అధికార దుర్వినియోగం జరగకుండా చేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అక్రమ నిర్మాణాలపై హైకోర్టు పలుసార్లు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. అందుకే అక్రమ నిర్మాణాలను నిర్మిసద్తే తక్షణమేకూల్చివేస్తామని ఆయన ప్రకటించారు. గతంలో అక్రమ నిర్మాణాల రెగ్యులరైజేషన్‌కు బీఆర్‌ఎస్ స్కీంలు తెచ్చామని, వాటి వల్ల ఉపయోగం లేదన్నారు. ఇకపైన లేఅవుట్లకు మున్సిపాలిటీల్లో అనుమతులు ఇవ్వరని, జిల్లా కలెక్టర్లు లే అవుట్లకు అనుమతులు ఇచ్చే అధికారాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. భూ మాఫియా ఆగడాలపై ఉక్కుపాదం మోపుతామని కేసీఆర్ హెచ్చరించారు.