రాష్ట్రీయం

రూ.12 వేల కోట్లతో ఆసరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జూలై 20: ఆదాయం పెంచి పేదలకు సంక్షేమ కార్యక్రమాల రూపంలో పంచడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపచడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షు డు, సిరిసిల్ల ఎమ్మెల్యే కే. తారకరామారావు అన్నా రు. శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కేటీఆర్ ఆసరా పింఛన్లు మంజూరు పత్రాల పంపిణీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో 50 లక్షల మంది అభాగ్యులకు పెన్షన్‌ల కోసం ఏటా రాష్ట్ర ప్రభుత్వం 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. పేదల పట్ల ప్రేమతో ఇంత భారీ ఖర్చును కేసీఆర్ ఖర్చు చేస్తున్నారని తెలిపారు. వీటిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం రూ.200 కోట్లు మాత్రమేనని ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. ఎవరికైనా అనుమానం ఉంటే ఈ విషయాన్ని రూఢీ చేసుకోవచ్చునని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను రెట్టింపు చేశామని వివరించారు. 17 శాతం వృద్ధి రేటుతో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందన్నారు. ఇలా పెంచిన ఆదాయాన్ని పేద ప్రజలకు పంచుతున్నామన్నారు. పింఛను అర్హత వయసు తగ్గింపు కూడా జూన్ నెల నుంచే వర్తిస్తుందని అన్నారు. బీడీ కార్మికులకు పీఎఫ్ కటాఫ్ తేదీని 2014 నుండి 2019కి తగ్గించడంతో కొత్తగా సుమారు రెండు లక్షల మందికి పింఛను అందుతున్నాయన్నారు. అలాగే నయా పైసా ఖర్చు లేకుండా, రాజకీయ జోక్యం లేకుండా లాటరీ పద్దతిలో పారదర్శకంగా ఇండ్లు లేని పేద ప్రజలకు నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్ళను త్వరలోనే లబ్దిదారులకు అందిస్తామన్నారు. సిరిసిల్లలో 1,500 ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి పంపిణీకి సిద్దంగా ఉన్నాయన్నారు. ప్రస్తుత మార్కెట్‌లో సుమారు రూ.20 లక్షలకు పైగా విలువల చేసే డబుల్ బెడ్ రూం ఇళ్ళను ఉచితంగా ఇస్తామన్నారు. మంచి రోజు కోసం చూస్తున్నామన్నారు. ప్రభుత్వ ఇళ్ళ కోసం ఎవరూ ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వొద్దని, ఆశావహులు ఎక్కువగా ఉన్న చోట లాటరీ తీసి ఇళ్ళను కేటాయిస్తామన్నారు. దశాబ్దాలుగా ఉన్న ఇళ్ళ పట్టాల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇంటి స్థలం ఉన్న పేదలు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు.. అందించే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. పేదల సమగ్ర సమాచారం తమ వద్ద ఉంది, పేదలను వెతికి పట్టుకుని తామే ఇళ్ళు ఇస్తామని, ఎలాంటి పైరవీలకు తావు లేదన్నారు. స్వయం సహాయక సంఘాలు పావలా వడ్డీ రుణ బకాయిలు రూ.65 కోట్లు రెండు రోజుల్లో చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో అసూయ పడేలా సిరిసిల్ల తయారైందని, బతుకమ్మ చీరల బకాయిలు అన్నింటిని చెల్లిస్తామన్నారు. బీడీ కార్మికుల వృత్తిని మార్చి అపెరాల్ పార్కులో నెలకు 15 వేల ఆదాయం వచ్చేలా ఉపాధి కల్పిస్తామన్నారు.
మీ వల్లే.. నాకీ గుర్తింపు
‘రాష్ట్రంలో, దేశంలో నాకు ఉన్న గుర్తింపు..మీ వల్లే దక్కింది’ అని శాసన సభ్యులు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ గుర్తింపునకు కారణమైన సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని కేటీఆర్ పునరుద్ఘాటించారు. అనంతరం కేటీఆర్ పెరిగిన ఆసరా ఫించన్ల మంజూరు పత్రాలను లబ్దిదారులు పంపిణీ చేశారు. కార్యక్రమాలలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, కలెక్టర్ కృష్ణ్భాస్కర్, స్ర్తిశిశు సంక్షేమ శాఖ రీజనల్ కోఆర్డినేటర్ గుగులోతు రేణ, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అకునూరి శంకరయ్య, సిరిసిల్ల తాజా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ, కేడీసీసీబీ ఉపాధ్యక్షులు ఉచ్చిడి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...పెన్షన్ పెంపు పత్రాలను పంపిణీ చేస్తున్న కేటీఆర్, అనంతరం ప్రసంగిస్తున్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్