రాష్ట్రీయం

ఆన్‌లైన్‌లో పోలీస్ స్టేషన్ల అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశ, దేశ పౌరుల భద్రత కోసం దేశంలోని అన్ని పోలీస్‌స్టేషన్లను ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయనున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ. కిషన్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం 60 నుంచి 70 శాతం పూర్తయిన ఈ ఆన్‌లైన్ ప్రక్రియను మరో రెండు నెలల్లో పూర్తి చేసి, కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యాలయంలోని నార్త్‌బ్లాక్ నుంచి నేరుగా పర్యవేక్షణ జరుగుతుందని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన బేగంపేటలోని హోటల్ హరితప్లాజాలో శనివారం ‘మీట్ ది జర్నలిస్టు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ భాగ్యనగరం ఐఎస్‌ఐ కార్యకలాపాలకు బ్రీడింగ్ సెంటర్‌గా మారిందని, ఇందుకు ఇటీవలే ఎన్‌ఐఏ కొందర్ని అదుపులోకి తీసుకోవటం ఉదాహరణగా పేర్కొన్నారు. మహిళల భద్రత, పోలీసింగ్ ఆధునీకరణ, టెర్రరిజం నిర్మూలన, జమ్మూకాశ్మీర్ సమస్యకు పరిష్కారం చేకూర్చేలా మరిన్ని చట్టాలను అమల్లోకి తేవాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలిపారు. నేషనల్ ఇనె్వస్టిగేషన్ అథారిటీ(ఎన్‌ఐ ఏ), కౌంటర్ టెర్రరిజం, మహిళల భధ్రత, జమ్మూకాశ్మీర్ సమస్య, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ వంటి కీలకమైన బాధ్యతలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా తాను నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. మొట్టమొదటి సారిగా ఎంపీ గా గెలిచి, కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తాను హోంశాఖలో ఏబీసీడీలు నేర్చుకుంటున్నానని, ప్రదాని నరేంద్రమోడీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అమిత్‌షా నిరంతర సమీక్షలతో తక్కువ కాలంలోనే తాను ఎంతో నేర్చుకున్నానని వివరించారు. దేశం మొత్తం తిరిగి అన్ని రాష్ట్రాలకు చక్కటి సేవలను అందించే అతి సున్నితమైన, ముఖ్యమైన శాఖ హోం అని అన్నారు. అంతేగాక, రెండోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కీలకమైన, అతిముఖ్యమైన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేలా ప్రధాని, హోం మంత్రి తనను ప్రోత్సహించారని గుర్తుచేశారు. పార్లమెంటు సమావేశాలను ఆగస్టు 2వ తేదీవరకు నిర్వహించే యోచనలో కేంద్రం ఉందని, ఇందుకు సంబంధించి సోమవారం జరగనున్న బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. సోమవారం జరిగే పార్లమెంటు సమావేశాల్లో చట్ట వ్యతిరేక చర్యల నిర్మూలన బిల్లును తానే లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. మహిళ భద్రత కోసం దేశవ్యాప్తంగా షీ టీంలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆపరేషన్ 2023 వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తుందని, నేడు ప్రజలు కోరుకుంటున్న మార్పుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం పని చేయటం వల్లే బీజేపీకి ఆదరణ పెరుగుతోందని ఆయన వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన జమ్మూకాశ్మీర్ సమస్యతో పాటు అన్ని అంశాలను అమలు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ, నగర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీని విమర్శించే అర్హత సీఎం కేసీఆర్‌కు లేదు మజ్లీస్‌ను నెత్తినెత్తుకున్న సీఎం కేసీఆర్‌కు బీజేపీ గురించి మాట్లాడే అర్హత లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో కారు, సారు, పదహారు, సర్కారు అంటూ గొప్పలు చెప్పుకుని ఏడు సీట్లు ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. ఇపుడు మున్సిపాల్టీల్లో అన్ని స్థానాలను మేమే గెలుస్తామని కేటీఆర్ ప్రకటించటం ఓవర్ కాన్ఫిడెన్స్ అని, మున్సిపాల్టీల ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలను గెలుచుకోవటం ఖాయమని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.