రాష్ట్రీయం

ఒకే ఇంటి నంబర్‌పై 300 ఓట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి: జిల్లాకేంద్రమైన భూపాలపల్లి మున్సిపల్ ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉండడంతో ఓటర్లంతా అయోమయంలో పడుతున్నారు. ఏకంగా ఒకే ఇంటి నంబర్‌పై 300 మంది ఓట్లు నమోదై ఉండడం సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. కుల గణన కూడా సరిగా లేకపోవడంతో ఓటరు కార్డుల్లో బీసీకి బదులు ఎస్సీ, ఎస్సీకి బదులు బీసీ అని చాలా మందికి తప్పులుదొర్లాయి. పట్టణానికి చెందిన గందె సుశ్మిత పేరున ఏకంగా మూడు ఓటరు గుర్తింపు కార్డులు రావడం విశేషం. ఇలా చెప్పుకుంటూ పోతే ఓటర్ల జాబితా పూర్తి స్థాయిలో తప్పులు నమోదు కావడంతో అన్ని రాజకీయ పార్టీలు జాబితాపై విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల జాబితాలో నమోదైన వ్యక్తుల పేర్లు కొన్ని స్థానికంగా ఉండని వారి పేర్లు రావడం విస్మయానికి గురి చేస్తుంది. ఓటర్ల జాబితా తప్పుల తడకగా రావడానికి కొందరు స్థానిక నేతల హస్తం ఉందనే ఆరోపణలు కూడా ప్రతిపక్షాలు బాహాటంగానే చేస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలలో కొత్త పేర్లు నమోదయ్యాయని, వారు స్థానికంగా ఉండే వ్యక్తులు కాదనే విమర్శలు కూడా వినవస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ప్రతిపక్షాలు ఓటర్ల జాబితాపై నిరసన వ్యక్తం చేసినా అధికారులు మాత్రం దాటవేస్తూ వస్తున్నారు. 2-64 ఇంటి నంబర్‌పై 180 ఓట్లు, 2-94 ఇంటి నంబరుపై 215 ఓట్లు మొత్తం 395 ఓట్లను జాబితాలో చేర్చారు. కొందరు అధికారులు, మాజీ కౌన్సిలర్లు ఇందులో హస్తం ఉందని ఆరోపణలు వినవస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు జాబితాలో దొర్లిన తప్పులపై ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.

చిత్రం...గందె సుస్మిత పేరున వచ్చిన మూడు ఓటరు గుర్తింపు కార్డులు