రాష్ట్రీయం

బలహీన వర్గాలకు అండగా ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 20: బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శనివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఓబీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్‌రావు, తెలంగాణ అధ్యక్షుడు జె శ్రీనివాసగౌడ్ తదితర నేతలు ముఖ్యమంత్రి జగన్‌ను కలుసుకున్నారు. మండల్ కమిషన్ నివేదిక పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తేదీ అయిన ఆగస్ట్ 7న ప్రతి ఏటా జాతీయ స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నట్లు జస్టిస్ ఈశ్వరయ్య సీఎంకు వివరించారు. ఈ ఏడాది హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సుకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. దశాబ్దాలు గడుస్తున్నా మండల్ కమిషన్ సిఫార్సులు అమలుకు నోచుకోవటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చేనెలలో హైదరాబాద్‌లో జరిగే సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారని కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల సీఎంలను కూడా ఆహ్వానించినట్లు చెప్పారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 33.5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేసన శంకర్‌రావు వినతిపత్రం సమర్పించారు. జీవో 550, ప్రైవేట్ రంగంలో బీసీలకు రిజర్వేషన్ల ఆవశ్యకతను సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కిశోర్ కుమార్, బీసీ నేతలు ఏ రాజు, కన్నా మాస్టారు, పరసా రంగరాజు పాల్గొన్నారు.
చిత్రం...ఏపీ సీఎం జగన్‌కు ఆహ్వానపత్రం అందజేస్తున్న జస్టిస్ ఈశ్వరయ్య, శ్రీనివాసగౌడ్ తదితరులు